Lokesh:నేటి నుంచే లోకేశ్‌ 'యువగళం' పాదయాత్ర పున:ప్రారంభం

  • IndiaGlitz, [Monday,November 27 2023]

టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 10.19గంటలకు పాదయాత్ర ప్రారంభంకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. అయితే ముందుగా అనుకున్నట్లు ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర కొనసాగడం లేదు.

విశాఖలో పాదయాత్ర ముగింపు..

ఈ ఏడాది జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేశ్ పాదయాత్ర మొదలుపెట్టారు. రాయలసీమలో పాదయాత్ర పూర్తి చేసి కోస్తా ప్రాంతంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వరకు కొనసాగింది. అయితే స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో అనూహ్యంగా చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో 208 రోజుల్లో 84 నియోజకర్గాల మీదుగా మొత్తం 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు. ఇదిలా ఉండగా గతంలో పార్టీ అధినేత చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం పాదయాత్ర’ను విశాఖలోనే ముగించారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో లోకేశ్‌ కూడా విశాఖలోనే పాదయాత్ర ముగించాలని భావిస్తున్నారు.

లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు...

ఉ. 10.19 – రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
ఉ. 11.20 – తాటిపాక సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
మ. 12.35 – పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం, నగరంలో గెయిల్, ఓఎన్జిసి బాధితులతో లోకేష్ ముఖాముఖి.
మ. 2.00 – మామిడికుదురులో స్థానికులతో సమావేశం.
మ. 2.45 – పాశర్లపూడిలో భోజన విరామం.
మ. 4.00 – పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
మ. 4.30 – అప్పనపల్లి సెంటర్ లో స్థానికులతో సమావేశం.
సా. 5.30 – అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ.
సా. 6.30 – బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి.
సా. 7.30 – పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటీ.
సా. 7.45 – పేరూరు శివారు విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.

రాజోలు,పి.గన్నవరం,అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.

More News

Modi:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన మోదీకి అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

Government School Children:ప్రభుత్వ బడి పిల్లలకు.. అమెరికా నుంచి మరోసారి ఆహ్వానం..

రాష్ట్రంలో విద్యా రంగానికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. నాడు-నేడు, మనబడి, విద్యాకానుక వంటి పథకాలతో విద్యార్థులను

Bigg Boss Telugu 7 : వెళ్లిపోతానన్న శివాజీని ఆపిన నాగార్జున , అశ్విని ఎలిమినేట్ .. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడనన్న ప్రశాంత్

బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు ఉత్కంఠగా జరుగుతోంది. మరికొద్దిరోజుల్లో ఈ సీజన్ ముగియనుండటంతో చివరి రోజుల్లో నిర్వాహకులు కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్నారు.

Vanitha Vijaykumar:వనితా విజయ్ కుమార్‌పై దాడి, గాయాలతో సహా పోస్ట్ చేసిన నటి.. బిగ్‌బాస్ వల్లేనా..?

నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుంటారు తమిళ నటి వనితా విజయ్ కుమార్ . ఆమె పెళ్లిళ్లు పెటాకులు కావడంతో పాటు పలు అంశాలపై చేసే వ్యాఖ్యలు

అస్మదీయుల కోసం అడ్డగోలు జీవోలు.. బాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం..

రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా టీడీపీ అధినేత చంద్రబాబు మాయలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తిమ్మిని బమ్మిని చేయడంలో ఆయనని మించిన దిట్ట ఎవరు