close
Choose your channels

‘మా’లో మళ్లీ రగడ.. న‌రేశ్‌కు వ్య‌తిరేకంగా లేఖ రాసిన ఈసీమెంబ‌ర్స్‌

Tuesday, January 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘మా’లో మళ్లీ రగడ.. న‌రేశ్‌కు వ్య‌తిరేకంగా లేఖ రాసిన ఈసీమెంబ‌ర్స్‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు ఇప్ప‌ట్లో స‌ద్దు మ‌ణిగేలా క‌న‌ప‌డం లేదు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు న‌రేశ్‌పై ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్స్ నిర‌స‌న గ‌ళ‌మెత్తారు. ఆయ‌న చ‌ర్య‌ల‌ను త‌ప్పు ప‌డుతూ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘానికి 9 లేఖ రాశారు. మాజీ అధ్య‌క్షుడు నిబంధన‌ల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించార‌ని క‌మిటీ వేశారు. స‌ద‌రు క‌మిటీ శివాజీరాజాకు క్లీన్ చిట్ ఇచ్చిన‌ప్ప‌టికీ న‌రేశ్ ఆయ‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని, త‌మ‌ను అవ‌మానిస్తున్నార‌ని ఈసీ స‌భ్యులు, ఒంటెద్దు పోక‌డ‌ల‌తో ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని, స‌భ్యులెవ‌రినీ సంప్ర‌దించ‌డం లేద‌ని వారు సంఘానికి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. న‌రేశ్ నిర్ణ‌యాల‌తో మా భ్ర‌ష్టు ప‌ట్టి పోతుంద‌ని, మా స‌భ్యులు ఆసుప‌త్రిలో ఉంటే క‌నీసం ప‌రామ‌ర్శించ‌లేద‌ని ప్ర‌ధాని కార్య‌ద‌ర్శి జీవిత లేఖ‌లో పేర్కొన్న‌ట్లు స‌మాచారం.

న‌రేశ్‌కు వ్య‌తిరేకంగా రాసిన ఈ లేఖ‌లో 15 మంది ఈసీ స‌భ్యులు సంత‌కాలు పెట్టిన‌ట్టు స‌మాచారం. న‌రేశ్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించార‌ని, నిధులు దుర్వినియోగం చేశార‌ని లేఖ‌లో రాసిన‌ట్లు స‌మాచారం. న‌రేశ్ ‘మా’అభివృద్ధికి అడ్డంకిగా మారార‌ని, త‌న నిర్ణ‌యాల‌తో సంస్థ భ్ర‌ష్టు ప‌ట్టిపోతుంద‌ని లేఖ‌లో జీవిత ఆరోపణ‌లు చేశార‌ట‌. న‌రేశ్ వ్య‌వ‌హారించే తీరుపై ఇంత‌కు ముందు నుండి మాజీ వైస్ ప్రెసిడెంట్ రాజ‌శేఖ‌ర్‌, ప్ర‌స్తుత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవిత అసంతృప్తిగా ఉన్నారు. మా డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో ఈ వ్య‌వ‌హారంపైనే రాజ‌శేఖ‌ర్ గట్టిగా మాట్లాడాల‌నుకున్నారు. కానీ ప్ర‌వ‌ర్తించిన తీరు స‌రిగ్గా లేద‌నే కార‌ణంతో క‌మ్ర‌శిక్ష‌ణ సంఘం ఆయ‌నపై చ‌ర్య‌లు తీసుకోవాల‌నుకుంది. కానీ రాజ‌శేఖ‌ర్ త‌నే రాజీనామా ఇచ్చేశారు. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల దృష్ట్యా ‘మా’కు సంబంధించిన చెక్కుల‌ను జీవిత త‌న‌తో పాటు తీసుకెళ్లిపోయార‌ని కూడా వార్త‌లు వచ్చాయి. మా ఆఫీస్ కూడా మూసివేశార‌ని టాక్‌.

ఇప్పుడు మ‌రోసారి మా స‌భ్యులు మ‌ధ్య వివాదం బ‌య‌ట‌కు పొక్కింది. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.