కండీష‌న్స్ పెట్టిన 'మ‌హ‌ర్షి' నిర్మాత‌లు

  • IndiaGlitz, [Tuesday,February 12 2019]

మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న 'మ‌హ‌ర్షి' చిత్రం ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఓ వైపు షూటింగ్ జ‌రుగుతుంటే, మ‌రోవైపు డ‌బ్బింగ్ ప‌నులు మొద‌ల‌య్యాయి. ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయిక‌. న‌రేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఏప్రిల్ 25న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకుంది. లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం నిర్మాత‌లు అమెజాన్‌కు కండీష‌న్ పెట్టార‌ట‌.

సినిమా విడుద‌లైన 50 రోజుల త‌ర్వాత డిజిట‌ల్ మాధ్య‌మంలో సినిమాను ప్ర‌సారం చేయాల‌నేదే ఆ కండీష‌న్‌. ఒక‌ప్పుడు 30 రోజుల త‌ర్వాత ప్ర‌సారం చేయాల‌నే కండీష‌న్‌ను ప‌క్క‌న పెట్టి కొత్త కండీష‌న్ పెట్టార‌ట నిర్మాత‌లు. దానికి అమెజాన్ సంస్థ కూడా ఒకే చెప్పింద‌ట‌.

More News

'RRR' లో చెర్రీ ఫ‌స్ట్‌లుక్ అప్పుడే...

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం `RRR`.

ఫిబ్రవరి 14న మజిలీ టీజర్ విడుదల

పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి సినిమా మజిలీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా 'అంజలి CBI' చిత్ర ట్రైలర్ విడుదల

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఇమైక్క నోడిగల్. ఈ చిత్రాన్ని తెలుగులో అంజలి సిబిఐ పేరుతో అనువదిస్తున్నారు.

'లవర్స్ డే' అద్భుతమైన ఫీల్ ఉన్న చిత్రం: నిర్మాత

ఒకే ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా సంచలన రేపిన ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంటగా నటించిన ''లవర్స్ డే ''(మలయాళంలో ఒరు ఆడార్ లవ్) చిత్రం రిలీజ్‌కు ముస్తాబైంది.

'నాగకన్య' ట్రైలర్ కు అద్భుతమైన స్పందన

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు.