మహేష్ బాబు హీరోయిన్ కైరా అద్వానీ పెళ్లి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది..

  • IndiaGlitz, [Monday,December 25 2017]

ధోనీ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కైరా అద్వానీ. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'భరత్ అను నేను' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న ఈ మూవీతో కైరా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అయితే తొలి సినిమా రిలీజ్ కాకుండానే కైరా క్రేజ్ పెరిగిపోయింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో కొత్తగా ప్రారంభంమైన యంగ్ డిజైనర్ శిరీషారెడ్డి బ్రైడల్ బొటిక్ ప్రారంభోత్సవం కైరా చేతుల మీదుగా జరిగింది.

సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్స్ తో ప్రారంభమైన ఈ బొటిక్ లోని అన్నీ డిజైనర్ వేర్స్. బ్రైడల్ డిజైన్స్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన శిరీషా డిజైన్స్ కు కైరా ఫిదా అయిపోయింది. అన్నీ ట్రెడిషనల్ గానూ ట్రెండీగా ఉన్నాయని శిరీష ప్రతిభను మెచ్చుకున్నారు. స్వయంగా శిరీష డిజైన్ చేసిన దుస్తులతోనే బొటిక్ ప్రారంభానికి విచ్చేసిన కైరా కెరీర్ కు సంబంధించిన విశేషాలను కూడా మీడియాతో షేర్ చేసుకుంది.. ఈ సందర్భంగా కైరా అద్వానీ చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే చూద్దాం..

"ఫస్ట్ టైమ్ తెలుగులో యాక్ట్ చేయబోతుండటం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ నాకు బాగా నచ్చింది. ఇక్కడి పీపుల్ నన్ను బాగా ఆదరిస్తున్నారు. మహేష్ బాబు లాంటి స్టార్ ను నేనింత వరకూ చూడలేదు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న భరత్ అను నేను అనే సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ విషయంలో నేను బెస్ట్ స్టూడెంట్ గా మారిపోయాను. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.

అయితే నా ఫ్రెండ్ శిరీష బొటిక్ ప్రారంభం నా చేతుల మీదుగా జరగడం చాలా ఆనందాన్నిచ్చింది. హైదరాబాద్ లో నేను చూసిన వారిలో శిరీష డిజైన్స్ అన్నీ చాలా బావున్నాయి. శిరీష ఫ్యాషన్ పై ప్యాషన్ ఉన్న డిజైనర్. అందుకే ఈ బ్రైడల్ కలెక్ట్స్ చూసి చాలా థ్రిల్ అయ్యాను. నా పెళ్లికి ఇక్కడి నుంచే డ్రెస్ తీసుకుంటాను. అలాగే నా కజిన్స్, నా ఫ్రెండ్స్ లో చాలామంది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వారందరికీ శిరీష బ్రైడల్ ఫ్యాషన్స్ నే ప్రిఫర్ చేస్తాను.. " అంటూ శిరీష డిజైన్స్ పై ప్రశంసల వర్షం కురిపించింది కైరా అద్వానీ.

ఈ సందర్భంగా యంగ్ డిజైనర్ శిరీషా రెడ్డి మాట్లాడుతూ.. "మారుతోన్న యువతరం టేస్ట్ కు అనుగుణంగా మోడ్రన్ టచ్ ఉన్న బ్రైడర్ వేర్ ను మేము అందిస్తున్నాం.. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ మధుర ఘట్టం. ఆ ఘట్టాన్ని మరింత మోడ్రన్ గా మెమరబుల్ గా మలచుకునేలా మా డిజైన్స్ ఉంటాయి. పెళ్లి మాత్రమే కాకుండా.. జీవితంలో జరిగే ప్రతి వేడుకకు సంబంధించీ మా దగ్గర అన్ని రకాల మోడ్రన్ డిజైన్స్ ఉంటాయి.. అలాగే వేడుకలకు సంబంధించి వారి పర్సనల్ టేస్ట్ మేరకు కూడా డ్రెస్ డిజైన్స్ చేస్తాము.. ఆధునిక యువతరం మెచ్చే అన్ని రకాల డిజైన్స్ ఉన్న ఈ బ్రైడల్ వేర్స్ ఆన్ లైన్ లో కూడా లభ్యమవుతాయని" చెప్పారు..

More News

మోహన్ బాబు 'గాయత్రి' ఫస్ట్ లుక్

విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గాయత్రి' చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైనది. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో మోహన్ బాబు పవర్ఫుల్ లుక్ విశేషంగా ఆకట్టుకోగా, పోస్టర్ పై ఉన్న కాప్షన్ "ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే...నాదీ తప్పే" మరింత  ఆసక్తిని రేపుతోంది.

డైరెక్టర్ మారుతి క్లాప్ ఇవ్వగా ప్రారంభమైన' ఫస్ట్ ర్యాంక్ రాజు' చిత్రం

డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్,మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్ ర్యాంక్ రాజు.

2018.. రామజోగయ్య శాస్త్రికి స్పెషల్

రామజోగయ్య శాస్త్రి..పరిచయం అక్కర్లేని పాటల రచయిత పేరిది.

రాజ్ తరుణ్ హీరోయిన్ మారింది

ఉయ్యాలా జంపాలా,సినిమా చూపిస్త మావ,కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్.

రవితేజ సినిమాకి ఆసక్తికరమైన టైటిల్

దాదాపు రెండేళ్ల గ్యాప్ తో మాస్ మహారాజ్ రవితేజ నుంచి వచ్చిన చిత్రం 'రాజా ది గ్రేట్'.