close
Choose your channels

డైరెక్టర్ మారుతి క్లాప్ ఇవ్వగా ప్రారంభమైన' ఫస్ట్ ర్యాంక్ రాజు' చిత్రం

Sunday, December 24, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్, మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్ ర్యాంక్ రాజు. మంజునాథ్ కంద్కూర్ నిర్మాత. స్టోరీ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ నరేష్ కుమార్ హెచ్.ఎన్.చేతన్ మద్దినేని, కాశిష్ వోరా జంటగా నటిస్తున్నారు. నరేష్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి, అమిత్ శర్మ (అర్జున్ రెడ్డి ఫేం) తనికెళ్ల భరణి, నరేష్, రమ్య, అదుర్స్ రఘు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం నారాయణమ్మ కాలేజ్ లో ఘనంగా జరిగింది. స్టార్ డైరెక్టర్ మారుతి క్లాప్ ఇచ్చారు. ఈరోజు నుంచి నారాయణమ్మ కాలేజ్ లో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.

మారుతి మాట్లాడుతూ...నరేష్ కుమార్ చెప్పిన కథ చాలా బాగుంది. మంచి కమర్షియల్ ఎనర్ టైనర్ ఇది. ఫస్ట్ ర్యాంక్ రాజు అనే క్యాచీ టైటిల్ సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. ముఖ్యంగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.

నిర్మాత మంజునాథ్ మాట్లాడుతూ...డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్, మారుతి టాకీస్ తో కలిసి నిర్మిస్తున్న మా చిత్రం ఫస్ట్ ర్యాంక్ రాజు. గోల్డెన్ హ్యాండ్ మారుతి గారి క్లాప్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. రెగ్యులర్ షూటింగ్ కూడా చేస్తున్నాం. పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. హిలేరియస్ కామెడీ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. మా దర్శకుడు నరేష్ చెప్పిన కథ అద్భుతంగా ఉంది. సినిమా కూడా అంతే బాగా వస్తుందని నమ్ముతున్నాం. అని అన్నారు.

దర్శకుడు నరేష్ మాట్లాడుతూ...మారుతి గారి ఆశిస్సులతో ఈ సినిమా ప్రారంభమైంది. ఆయన మాకు బ్యాక్ బోన్ గా ఉన్నారు. నేను చెప్పిన కథ నచ్చి ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్తున్న మా నిర్మాతలకు చాలా థాంక్స్. హీరోగా చేతన్ కు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. డైరెక్టర్ గా నాకు మంచి గుర్తింపు తెచ్చే చిత్రంగా ఉంటుంది. నిర్మాతలకు కాసులు కురిపించే విధంగా సినిమా కథ కుదిరింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంటుందీ చిత్రం. అని అన్నారు.

నటీనటులు...చేతన్ మద్దినేని, కాశిష్ వోరా, నరేష్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి, అమిత్ శర్మ (అర్జున్ రెడ్డి ఫేం) తనికెళ్ల భరణి, నరేష్, రమ్య, అదుర్స్ రఘు తదితరులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.