సర్కారు వారి పాట : ‘‘కళావతి’’ సాంగ్ అదరహో, ఒకరోజు ముందే వాలంటైన్స్ ‌డే కానుక

  • IndiaGlitz, [Monday,February 14 2022]

కొన్ని ఊహించని సంఘటనల వల్ల ఎంతటి వారైనా ఇబ్బందులు పడాల్సిందే. దీని వల్ల మంచో, చెడో రెండూ జరగొచ్చు. అచ్చం ఇదే పరిస్ధితిని ఎదుర్కొంటోంది సర్కార్ వారి పాట చిత్ర యూనిట్. సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ఆంక్షల ఎత్తివేత కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా నిర్వహిస్తున్నారు. తొలుత సంక్రాంతికి రావాల్సిన సర్కారు వారి పాటను... ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి బడా బడ్జెట్ సినిమాల కోసం వాయిదా వేయాల్సి వచ్చింది. చివరికి సమ్మర్ కానుకగా మే 12ని లాక్ చేశారు నిర్మాతలు.

ఇకపోతే.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ‘కళావతి’ సాంగ్‌ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. అందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా.. ఊహించని విధంగా కళావతి ఫుల్ సాంగ్ నెట్టింట్లో లీకైంది. దీంతో చిత్ర యూనిట్ ఉలిక్కిపడింది. దీంతో సోమవారం రావాల్సిన ఈ సాంగ్‌ని అభిమానుల కోసం ఈ రోజే విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, తమన్ స్వరాలు సమకూర్చారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న సర్కార్ వారి పాటను... మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాగా.. ‘‘కళావతి’’ లీకేజ్‌ ఘటనపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ ఎమోషనల్ అయ్యారు. తన హృదయం ముక్కలైందంటూ ఓ ఆడియోని ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘మనసంతా బాధగా ఉందని.. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు. దాదాపు ఆర్నెళ్లుగా ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డామని... ఈ పాట చిత్రీకరణ జరిగే సమయంలో ఎనిమిది మందికి కరోనా వచ్చిందని తమన్ తెలిపారు. అయినా సరే, తామంతా కలిసి మంచి సాంగ్‌ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేశామని ఆయన పేర్కొన్నారు. త్వరలో మీ అందరికీ ఈ పాట వినిపించాలనుకున్నామని.. కానీ, ఒకడు అంత ఈజీగా దీన్ని లీక్‌ చేసేసి.. ఆన్‌లైన్‌లో పెట్టేశాడని తమన్ ఆవేదన వ్యక్తం చేశారు

More News

గవర్నర్లు, సీఎంలు మా ఇంటికి వస్తారు.. పేర్ని నాని కూడా అలానే, దాన్ని తప్పుబడతారా: మోహన్‌బాబు ఆగ్రహం

తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న సమస్యలపై చర్చించేందుకు  మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని

లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సూర్య స్టెప్ , తెలుగు ఫ్యాన్స్ కోసమే.. ఫోటోలు వైరల్

తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వున్న కోలీవుడ్ నటుల్లో సూర్య ఒకరు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగు,

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన పూనమ్ కౌర్ - నాగు గవర 'నాతిచరామి' ట్రైల‌ర్‌కు సూపర్బ్ రెస్పాన్స్

అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా నాగు గవర దర్శకత్వం వహించిన సినిమా 'నాతిచరామి'.

భారత కార్పోరేట్ రంగంలో విషాదం.. దిగ్గజ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్‌ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు.

ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో జనరిక్‌ మెడికల్‌ షాపులు

ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెట్రో స్టేషన్‌లలో జనరికల్ మెడికల్ షాపులను అందుబాటులోకి తెచ్చింది