మ‌రోసారి సామాజిక బాధ్య‌త‌ను తెలియ‌జేసిన మ‌హేశ్‌

  • IndiaGlitz, [Tuesday,July 28 2020]

క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినిమా రంగం అంతా స్తబ్దుగా మారింది. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి, సినిమా షూటింగ్స్ ఆగాయి. ఐదు నెల‌ల త‌ర్వాత షూటింగ్స్ నెమ్మ‌దిగా స్టార్ట్ అవుతున్నాయి. కానీ స్టార్స్ మాత్రం క‌రోనా వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల భ‌య‌ప‌డుతున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మైన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, పిల్ల‌లు, పుస్త‌కాలు, వెబ్ సిరీస్‌ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. సామాజిక బాధ్య‌తతో వ్య‌వ‌హ‌రించే సూప‌ర్‌స్టార్ లేటెస్ట్ ట్వీట్ మ‌రోసారి ఆయ‌న‌లోని సోష‌ల్ రెస్పాన్స్‌బిలిటీని తెలియ‌జేసింది.

‘‘నీటిని సంరక్షించుకోండి. వనరులను పునరుత్తతి అయ్యేలా వినియోగించుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఈ గ్లోబల్ క్రైసిస్ నుండి మ‌నల్ని మ‌న‌మే ర‌క్షించుకోవాలి. మ‌న ప‌కృతిని కూడా కాపాడాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మార్పు మీ ఇంటి నుండే మొద‌లు పెట్టండి’’ అని తెలిపారు మహేశ్.

సినిమాల విషయానికి వస్తే పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’ సినిమా తెర‌కెక్క‌నుంది. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత ఈ సినిమా షూటింగ్‌ను మ‌హేశ్ మొద‌లు పెడ‌తారు. ఇందులో కీర్తిసురేశ్ హీరోయిన్‌.

More News

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో దుల్క‌ర్ త్రిభాషా చిత్రం...

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ త‌న‌యుడు మ‌మ్ముటి త‌న‌యుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన దుల్క‌ర్ సల్మాన్ సూప‌ర్‌స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

కరోనా విషయమై అధికారులపై హైకోర్టు ప్రశ్నల వర్షం

రాష్ట్రంలో కరోనా వ్యవహారంపై హైకోర్టులో నేడు కూడా విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు చీఫ్ సెక్రటరీ, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ,

భయపడకండి.. ఆగస్ట్ 15కు మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్

ఇది నిజంగా ప్రజానీకానికి గుడ్ న్యూసే.. కరోనా భయంతో అల్లాడుతున్న ప్రజానీకానికి అద్భుతమైన వరం.

15 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. ఒక్కరోజే 654 మంది మృతి

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా ప్రతి రోజూ దాదాపు 50 వేల కేసులు నమోదవుతున్నాయి.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు..

ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను