మహేష్ సినిమా 60 శాతం పూర్తి...

  • IndiaGlitz, [Thursday,November 03 2016]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు 'ఎజెంట్ శివ' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ షెడ్యూల్‌తో సినిమా 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటుంది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం యూనిట్ అహ్మ‌దాబాద్ వెళ్ల‌నుంది. దాంతో సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే ప్రీ రిలీజ్ బిజినెస్ విష‌యంలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే సినిమా శాటిలైట్ హ‌క్కుల‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ హ‌క్కుల‌ను దాదాపు 16 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించి చేజిక్కించుకుంద‌ని స‌మాచారం.