close
Choose your channels

మహేష్ సినిమా 60 శాతం పూర్తి...

Thursday, November 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు `ఎజెంట్ శివ` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ షెడ్యూల్‌తో సినిమా 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటుంది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం యూనిట్ అహ్మ‌దాబాద్ వెళ్ల‌నుంది. దాంతో సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే ప్రీ రిలీజ్ బిజినెస్ విష‌యంలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే సినిమా శాటిలైట్ హ‌క్కుల‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ హ‌క్కుల‌ను దాదాపు 16 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించి చేజిక్కించుకుంద‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.