మహేష్ , మురగదాస్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్....

  • IndiaGlitz, [Monday,November 14 2016]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు 'ఎజెంట్ శివ' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. లెటెస్ట్‌గా ఈ సినిమా హైద‌రాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేస్తుంది. దీంతో సినిమా అర‌వై శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటుంది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం యూనిట్ అహ్మ‌దాబాద్ వెళ్ల‌నుంది. అహ్మ‌దాబాద్ షెడ్యూల్ న‌వంబ‌ర్ 24 నుండి జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్‌లో సినిమాను ఎక్కువ శాతం పూర్తి చేసే అవ‌కాశాలున్నాయట‌.

సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే సినిమా శాటిలైట్ హ‌క్కుల‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ హ‌క్కుల‌ను దాదాపు 16 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించి చేజిక్కించుకుంద‌ని స‌మాచారం. వంద కోట్ల‌కు పైగా భారీ బ‌డ్టెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విష‌యంలో కూడా సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌రి విడుద‌ల త‌ర్వాత సినిమా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి...

More News

అనసూయ బరువు పెరిగింది....

జబర్ దస్త్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుల్లితెర యాంకర్ అనసూయ వెండితెర పై కూడా సందడి చేసింది.

హెబ్బా అతనితోనే డేట్ కు వెళుతుందట...

ఈ మధ్య యూత్ డేట్ చేయడం సర్వసాధారణమైపోయింది.

'జయమ్ము నిశ్చయమ్మురా' ప్రచారంలో పాలుపంచుకున్నందుకు గర్వంగా ఉంది! దర్శకులు కొరటాల శివ

"జయమ్ము నిశ్చయమ్మురా" సినిమా చూశాను.ఇటీవలకాలంలో ఇంత మంచి సినిమా చూడలేదని నా ఫీలింగ్.

'నేత్ర' ఆడియో విడుదల

రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్,ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్ లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం

సింగం - 3 టీజర్ కు 48 గంటల్లో 5 మిలియన్ వ్యూస్

తమిళం,తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్ ను,మార్కెట్ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా