close
Choose your channels

మహేష్ , మురగదాస్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్....

Monday, November 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు `ఎజెంట్ శివ` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. లెటెస్ట్‌గా ఈ సినిమా హైద‌రాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేస్తుంది. దీంతో సినిమా అర‌వై శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటుంది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం యూనిట్ అహ్మ‌దాబాద్ వెళ్ల‌నుంది. అహ్మ‌దాబాద్ షెడ్యూల్ న‌వంబ‌ర్ 24 నుండి జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్‌లో సినిమాను ఎక్కువ శాతం పూర్తి చేసే అవ‌కాశాలున్నాయట‌.

సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే సినిమా శాటిలైట్ హ‌క్కుల‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ఈ సినిమాకు సంబంధించి శాటిలైట్ హ‌క్కుల‌ను దాదాపు 16 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించి చేజిక్కించుకుంద‌ని స‌మాచారం. వంద కోట్ల‌కు పైగా భారీ బ‌డ్టెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విష‌యంలో కూడా సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌రి విడుద‌ల త‌ర్వాత సినిమా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.