మ‌హేశ్ కొత్త వ్యాపారం...!!

  • IndiaGlitz, [Sunday,August 30 2020]

హీరోగానే కాదు.. నిర్మాత‌గా, ఎంటర్ ప్రెన్యూర‌ర్‌గా మ‌హేశ్ నేటి త‌రం హీరోల్లో త‌న‌దైన స్టైల్లో దూసుకెళ్తున్నారు. అయితే త్వ‌ర‌లోనే మ‌హేశ్ కొత్త వ్యాపార‌స్థుడిగా క‌నిపించ‌బోతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కూ మ‌హేశ్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయ‌బోతున్నార‌నే ఆస‌క్తి క‌ల‌గ‌క‌మాన‌దు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. మ‌హేశ్ వ్యాపారం చేయ‌బోయేది రియ‌ల్ లైఫ్‌లోకాదు.. రీల్ లైఫ్‌లో. బిజినెస్‌మేన్‌లో గ్యాంగ్‌స్ట‌ర్ నుండి బ్యాంకు అధినేత‌గా ఎదుగుతాడు మ‌హేశ్‌. అలాగే శ్రీమంతుడులో పెద్ద వ్యాపారాలున్న వ్య‌క్తిగా క‌నిపిస్తారు. ఇప్పుడు త‌ను చేయ‌బోయే 27వ చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’లోనూ మ‌హేశ్ బిజినెస్‌మేన్‌గా కనిపిస్తార‌ట‌. ఇంత‌కూ మ‌హేశ్ ఎలాంటి బిజినెస్‌మేన్‌గా కనిపిస్తారు? అనే సందేహం క‌లుగ‌క‌మాన‌దు.

వివ‌రాల్లోకెళ్తే.. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, ప‌రుశురాం కాంబినేష‌న్‌లో ‘స‌ర్కారువారి పాట‌’ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల ఆగిన ఈ సినిమా సెట్స్‌పై వెళ్ల‌డానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మ‌హేశ్ క్యారెక్ట‌ర్‌పై ప‌లు రకాలైన వార్త‌లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ‘స‌ర్కారువారి పాట‌’ ఫైనాన్స్ చేసే వ్యాపారిగా కనిపిస్తార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేశ్ క‌నిపించిన పాత్రల‌కు ఈ పాత్ర భిన్న‌మైంద‌నే చెప్పొచ్చు. మ‌రి వ‌డ్డీవ్యాపారిగా మ‌హేశ్ ఎలా మెప్పించ‌నున్నారో చూడాలి.

More News

అన్‌లాక్-4 మార్గదర్శకాలివే..

అన్‌లాక్-4 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.

ఐదున్నర నెలల తర్వాత మళ్లీ వర్క్ చేయబోతున్నా: నాగార్జున

తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అక్కినేని నాగార్జున గుడ్ న్యూస్ చెప్పారు. ఐదున్నర నెలల తర్వాత మళ్ళీ వర్క్ చేయబోతున్నానని నాగ్ తెలిపారు.

నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నా.. అయితే..: సమంత

ఇటీవల, చాలా మంది సెలబ్రిటీలు తాము గర్బం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

తన బర్త్‌డే సందర్భంగా ఓ మహిళకు సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగ్..

ఆరు పదుల వయసులోనూ యువకుడిలా కనిపిస్తారు అక్కినేని నాగార్జున. నేడు ఆయన పుట్టినరోజు.

నెపోటిజం వల్ల నాకెలాంటి సమస్యా  ఎదురుకాలేదు:  నివేదా థామస్

సెలక్టివ్‌గా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ న‌టిగా ఒక్కో మెట్టు ఎదుగుతున్న హీరోయిన్స్ నివేదా థామ‌స్‌.