మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభమయ్యేది ఆ రోజునే...

  • IndiaGlitz, [Wednesday,May 22 2019]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇండియా లేడు. 'మ‌హ‌ర్షి' స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటూ సమ్మ‌ర్‌వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈయ‌న త‌దుప‌రి చేయ‌బోయే 26వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు మాత్రం శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

సాధార‌ణంగానే త‌న సినిమా ఓపెనింగ్‌ల‌కు మ‌హేష్ రాడు. ఇక ఇండియాలో లేన‌ప్పుడు ఆ ఆలోచ‌న రావ‌డ‌మే త‌ప్పు అవుతుంది. ఎప్ప‌టిలా మ‌హేష్ తన తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌నే ముఖ్య అతిథిగా పంప‌బోతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే మ‌హేష్ 26వ సినిమాకు ముహూర్తం కుదిరింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌. జూలై నుండే రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. 

More News

టీవీ9 వివాదం పై రవిప్రకాష్ సంచలన వీడియో విడుదల

టీవీ9 వివాదంలో రవిప్రకాష్‌కు పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా పోలీసు బృందాలు ఆయనకోసం గాలిస్తున్నారు.

లో దుస్తులు క‌న‌ప‌డేలా శ్రియ డ్యాన్స్‌

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు, త‌మిళంలో రాణించిన హీరోయిన్ శ్రియాశ‌ర‌న్‌. బాలీవుడ్‌లో కూడా ఈ అమ్మ‌డు ఒక‌ట్రెండు సినిమాల్లో న‌టించింది.

బైక్ రేస్ ట్రైనింగ్‌లో విజ‌య‌దేవ‌ర‌కొండ‌

యూత్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు త‌దుప‌రి సినిమాగా ఆనంద్ అన్నామ‌లై సినిమాను చేస్తున్నాడు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సినిమా రూపొంద‌నుంది.

'సాహో'కి స‌ల్మాన్ అతిథి అవుతాడా?

'బాహుబ‌లి' త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సినిమాల‌పై భారీ అంచ‌నాలున్నాయి. ఈ ఏడాది ఆగ‌స్ట్ 15న విడుద‌ల కాబోయే 'సాహో'తో ప్ర‌భాస్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాడు.

మ‌హేష్ మ‌ళ్లీ గ్రీన్ సిగ్న‌ల్‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి' మే 9న విడుద‌లై మంచి క‌లెక్ష‌న్స్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సినిమా మేకింగ్ విష‌యంలో మ‌హేష్ చాలా హ్యాపీగా ఉన్నాడ‌ట‌.