close
Choose your channels

చిరంజీవి సినిమాలో మహేష్ బాబు పాత్ర ఇదే ?

Wednesday, February 26, 2020 • తెలుగు Comments

చిరంజీవి సినిమాలో మహేష్ బాబు పాత్ర ఇదే ?

ప్ర‌స్తుతం మ‌హేశ్ 27వ సినిమా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సింది ..క‌థ బాగోలేద‌నే కార‌ణంతో ఆగింది. ఈలోపు మ‌హేశ్ ఏం చేస్తాడా? అని అంద‌రూ అనుకున్నారు. కానీ ఈలోపు మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా నుండి పిలుపు రావ‌డంతో మ‌హేశ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. నిజానికి చిరంజీవితో రామ్‌చ‌ర‌ణ్ న‌టించాల్సిన చిత్ర‌మ‌ది. అయితే `ఆర్ఆర్ఆర్‌` సినిమా కార‌ణంగా రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం లేకుండా పోయింది. దీంతో చ‌ర‌ణ్ స్థానంలో మ‌హేశ్‌ను సంప్ర‌దించ‌డం..ఆయ‌న ఓకే అన‌డం అంతా చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

నిజానికి డైరెక్ట‌ర్ కొర‌టాల శివ.. రామ్‌చ‌ర‌ణ్ కోసం ఓ న‌క్స‌లైట్ పాత్ర‌ను డిజైన్ చేశాడు. అయితే ఇప్పుడు మ‌హేశ్ వ‌చ్చాడు. ఆయ‌న‌కు న‌క్స‌లైట్ పాత్ర కంటే కాలేజ్ స్టూడెంట్ పాత్ర సూట్ అవుతుంద‌ని భావించిన కొర‌టాల ఇప్పుడు పాత్ర తీరు తెన్నుల‌ను మార్చేస్తున్నాడ‌ట‌. 30 నిమిషాల పాటు సాగే ఈ పాత్ర కోసం మ‌హేశ్‌కి భారీగానే నిర్మాత‌లు రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నారు. ఈ పాత్ర కోసం మ‌హేశ్ 20 రోజుల పాటు కాల్షీట్స్ ఇచ్చాడ‌ట‌. మొన్న‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌పై సందిగ్ధ‌త ఉండ‌టంతో.. సినిమా విడుద‌ల‌పై కాస్త అనుమానాలున్నాయి. ఇప్పుడు మ‌హేశ్..చె్రీ స్థానంలోకి రావ‌డంతో ఇప్పుడు సినిమా విడుద‌ల అనుకున్న‌ట్లే ఆగ‌స్ట్‌లోనే ఉంటుందంటున్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz