గ్రాండ్‌గా మహేశ్- త్రివిక్రమ్ మూవీ లాంచ్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అయ్యే న్యూస్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కింది. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో వున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. హీరోయిన్ ‌పూజ హెగ్డే‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచ్ఛాన్ చేయగా... మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ క్లాప్ కొట్టారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత చినబాబు వెల్లడించారు.

సాధారణంగా మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్‌ల‌కు రారు.. కెరీర్ ప్రారంభం నుంచి ఆయనకు అదొక సెంటిమెంట్‌గా వస్తోంది. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా ప్రారంభోత్సవానికి కూడా సూపర్‌స్టార్ రాలేదు. అయితే... మహేశ్‌కు బదులు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అయ్యారు.

గతేడాది సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిపాటి షూటింగ్ మిగిలివున్నట్లుగా తెలుస్తోంది. మహేశ్ కోలుకున్నాక.. మిగిలిన భాగం కంప్లీట్ చేసి సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇకపోతే.. ‘‘అతడు’’, ఖలేజా తర్వాత దాదాపు 12 ఏళ్లకు మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. SSMB28ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సంస్థ బ్యానర్‌లో ఇది ఏడో సినిమా. అంతేకాదు త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - పూజా హెగ్డే, త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - తమన్ కాంబినేషన్‌లో కూడా ఇది హ్యాట్రిక్ చిత్రం. త్రివిక్రమ్ దర్శకత్వంలో, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో 'అరవింద సమేత వీరరాఘవ', 'అల వైకుంఠపురములో' చేశారు పూజా హెగ్డే. తాజాగా మహేశ్‌తో సినిమా మూడవది.

More News

ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే ఓటీటీ గురించి టాక్, సర్కార్ వారి పాటను అమెజాన్ కొనేసిందా..?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరో పరశు రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘సర్కార్ వారి పాట’’ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. సమ్మర్ కనుకగా మే 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్

ఎన్టీఆర్-బుచ్చిబాబు సినిమాకు టైటిల్ ఇదేనా.. గురువుదారిలో ఉప్పెన డైరెక్టర్..?

ఆర్ఆర్ఆర్ కారణంగా దాదాపు మూడేళ్ల పాటు అభిమానులకు దూరమయ్యారు. ఇంత ఎదురుచూసినప్పటికీ ఆర్ఆర్ఆర్ మాత్రం రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ మరింత నిరాశకు గురవుతున్నారు.

ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశ... ఎన్టీఆర్- కొరటాల ఓపెనింగ్‌ వాయిదా...?

సినీ పరిశ్రమకు గత కొంతకాలంగా టైం బాగున్నట్లు లేదు. కోవిడ్, లాక్‌డౌన్ సమస్యలకు తోడు ప్రభుత్వాల జోక్యంతో చిత్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తోందన్న

'రావణాసుర' సెట్‌లో అడుగు పెట్టిన రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న `రావణాసుర` సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో సుశాంత్, ఇతర తారాగణం

పెళ్లి కాని ప్రసాద్ కథతో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటోన్న 'అశోకవనంలో అర్జున కళ్యాణం' టీజర్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాల విషయంలో దూకుడు పెంచారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్ ప్రస్తుతం..