close
Choose your channels

గ్రాండ్‌గా మహేశ్- త్రివిక్రమ్ మూవీ లాంచ్

Thursday, February 3, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ్రాండ్‌గా మహేశ్- త్రివిక్రమ్ మూవీ లాంచ్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అయ్యే న్యూస్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కింది. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో వున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. హీరోయిన్ ‌పూజ హెగ్డే‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచ్ఛాన్ చేయగా... మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ క్లాప్ కొట్టారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత చినబాబు వెల్లడించారు.

గ్రాండ్‌గా మహేశ్- త్రివిక్రమ్ మూవీ లాంచ్

సాధారణంగా మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్‌ల‌కు రారు.. కెరీర్ ప్రారంభం నుంచి ఆయనకు అదొక సెంటిమెంట్‌గా వస్తోంది. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా ప్రారంభోత్సవానికి కూడా సూపర్‌స్టార్ రాలేదు. అయితే... మహేశ్‌కు బదులు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అయ్యారు.

గ్రాండ్‌గా మహేశ్- త్రివిక్రమ్ మూవీ లాంచ్

గతేడాది "సరిలేరు నీకెవ్వరు"తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిపాటి షూటింగ్ మిగిలివున్నట్లుగా తెలుస్తోంది. మహేశ్ కోలుకున్నాక.. మిగిలిన భాగం కంప్లీట్ చేసి సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

గ్రాండ్‌గా మహేశ్- త్రివిక్రమ్ మూవీ లాంచ్

ఇకపోతే.. ‘‘అతడు’’, "ఖలేజా" తర్వాత దాదాపు 12 ఏళ్లకు మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. SSMB28ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సంస్థ బ్యానర్‌లో ఇది ఏడో సినిమా. అంతేకాదు త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - పూజా హెగ్డే, త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - తమన్ కాంబినేషన్‌లో కూడా ఇది హ్యాట్రిక్ చిత్రం. త్రివిక్రమ్ దర్శకత్వంలో, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో 'అరవింద సమేత వీరరాఘవ', 'అల వైకుంఠపురములో' చేశారు పూజా హెగ్డే. తాజాగా మహేశ్‌తో సినిమా మూడవది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.