ఏడాది చిన్నారికి ప్రాణదాతగా మారిన మహేష్

  • IndiaGlitz, [Tuesday,June 23 2020]

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాది పసివాడికి ప్రాణదాతగా మారాడు. చిన్నారి తల్లిదండ్రులు మహేష్‌కు, ఆంధ్రా హాస్పిటల్ యాజమాన్యానికి థాంక్స్ చెప్పారు. ఏడాది కూడా నిండని పసివాడు హృదయ సంబంధిత రోగంతో బాధపడుతున్నాడు. దీంతో ఆ చిన్నారికి గుండెకు ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మహేష్ ఆ చిన్నారికి ఆంధ్రా హాస్పిటల్ సహకారంతో ఆపరేషన్ చేయించాడు.

రెండు వారాల తరువాత ప్రస్తుతం ఆ పసివాడు కోలుకుని డిశ్చార్జ్ అవడానికి సిద్ధంగా ఉన్నాడు. తమ కుమారుడికి ప్రాణదాతగా మారిన మహేష్‌కు, ఆంధ్రా హాస్పిటల్ యాజమాన్యానికి చిన్నారి పేరెంట్స్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా ఎందరో చిన్నారులకు మహేష్ ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో గుండెకు సంబంధించిన ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా మారారు.

More News

తెలంగాణలో షాకింగ్ కేసులు.. ప్రతి 4 టెస్టుల్లో ఒకటి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు షాక్‌కు గురి చేస్తున్నాయి. ప్రతి నాలుగు టెస్టుల్లో ఒకటి పాజిటివ్ కావడం గమనార్హం.

బ‌న్నీకి భారీ రెమ్యున‌రేష‌న్‌..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త‌న రేంజ్‌ను క్ర‌మంగా పెంచుకుంటూ వ‌స్తున్నారు.

నానిని మ‌రోసారి ఫిదా చేయ‌నుందా?

నేటి త‌రం యువ క‌థానాయ‌కుల్లో నేచుర‌ల్ స్టార్ నాని ఏక‌ధాటిగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే త‌న 25వ చిత్రం ‘వి’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

సమంత పాన్ ఇండియా మూవీ..?

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి.

బాల‌య్య హీరోయిన్‌కి అరుదైన అవార్డు

తెలుగు నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న లెజెండ్‌లో న‌టించిన న‌టి రాధికా ఆప్టే. ఆమెకు ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో అరుదైన అవార్డు ల‌భించింది.