అల‌నాటి హీరోయిన్‌గా మాళ‌విక‌

  • IndiaGlitz, [Thursday,November 15 2018]

ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అనే రెండు భాగాలుగా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. పార్ట్ వ‌న్ విష‌యానికి వ‌స్తే ఇందులో ఎన్టీఆర్ జీవితంలో సినిమాల్లో ఆయ‌న అగ్ర క‌థానాయ‌కుడిగా ఎదిగిన వైనాన్ని చూపించ‌నున్నారు. ఇందులో చాలా మంది తార‌లు క‌నిపిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, షాలిని పాండే, అనుష్క త‌దిత‌రులు ఎన్టీఆర్ న‌టించిన అల‌నాటి హీరోయిన్స్ పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

కాగా.. ఎన్టీఆర్‌తో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ కృష్ణ‌కుమారి పాత్ర‌ను య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడులో చిత్రీక‌రించ‌బోతున్నారు. కృష్ణ‌కుమారి పాత్ర‌లో మాళ‌వికా నాయ‌ర్ న‌టించ‌నున్నార‌ట‌. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌, కృష్ణ‌కుమారి మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఎలాంటి రిలేష‌న్ గురించి చ‌ర్చించ‌కుండా వలం వారు న‌టించిన సినిమాల్లో పాట‌ల‌ను మాత్ర‌మే చిత్రీక‌రిస్తున్నార‌ట. య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది.

More News

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సూర్య స‌పోర్ట్‌

ప్ర‌స్తుతం తెలుగులో సెన్సేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగిన క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. తెలుగుతో పాటు త‌మిళంలో కూడా నోటా చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు.

ఒక్క‌టైనా ర‌ణ‌వీర్‌, దీపిక‌

బాలీవుడ్ స్టార్స్ ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనెల వివాహం ఇట‌లీలోని లేక్ కోమోలో జ‌రిగింది. ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మైన వీరి పెళ్లి తంతు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముగిసింద‌ట‌.

శ్రీ కృష్ణ క్రియేషన్స్ విడుదల చేస్తున్న 'నెక్ట్స్ ఏంటి'

యూత్ లో తమన్నా గ్లామర్ కున్న ఫాలోయింగ్ గురించి  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యువ హీరోల్లో మంచి సక్సెస్ చిత్రాల్లో నటించిన సందీప్ కిషన్ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు.

అర్జున్ పెట్టిన కేసును ర‌ద్దు చేయాల‌న్నశృతి

ప్ర‌స్తుతం దేశంలోని హాట్ టాపిక్స్‌లో మీ టూ ఉద్య‌మం ఒక‌టి. ప‌లువురు రాజ‌కీయ‌, సినీ, క్రీడా ప్ర‌ముఖులు ఈ ఉద్య‌మంలో లైంగిక ఆరోప‌ణ‌లను ఎదుర్కొన్న‌వారే.

'ఇండియ‌న్ 2' లో మ‌రో యువ న‌టుడు

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ త్వ‌ర‌లోనే పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.