నవంబర్ 4న విడుదలకు సిద్ధమవుతున్న' మనలో ఒకడు'

  • IndiaGlitz, [Sunday,October 23 2016]

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం 'మ‌న‌లో ఒక‌డు'. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించారు. ఈ సినిమాను న‌వంబ‌ర్ 4న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా....
ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ '' 'మ‌న‌లో ఒక‌డు'పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఇటీవ‌ల తిరుప‌తిలో వ‌న్ మిలియ‌న్ క్లిక్స్ డిస్క్ ఫంక్ష‌న్స్ నిర్వ‌హించాం. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. కొన్ని య‌దార్థ ఘ‌ట‌నల‌ ఆధారంగా 'మ‌న‌లో ఒక‌డు' క‌థ‌ను రాసుకున్నాం. ఈ సినిమాలో నేను కృష్ణ‌మూర్తి అనే అధ్యాప‌కుడి పాత్ర‌లో న‌టించాను. ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అది. డైలాగ్ కింగ్ సాయికుమార్‌గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. మ‌న‌లో ఒక‌డు' సినిమా ఫస్ట్ కాపీ సిద్ధ‌మైంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త్వ‌ర‌లో సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ 4న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని అన్నారు.
నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ '' ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. అలాంటి మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాం. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు, థియేట్రిల‌క్ ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఫ‌స్ట్‌కాపీ సిద్ధ‌మైంది. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి న‌వంబ‌ర్ 4న సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
సాయికుమార్‌, జెమిని సురేశ్ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమాకు కెమెరామేన్: ఎస్‌.జె.సిద్ధార్థ్‌, స‌హ నిర్మాత‌లు: ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, క్రియేటివ్ హెడ్: గౌత‌మ్ ప‌ట్నాయ‌క్‌, పాట‌లు: చైత‌న్య ప్ర‌సాద్‌, వ‌న‌మాలి, పుల‌గం చిన్నారాయ‌ణ‌.

More News

బలి..బలి..బలిరా బలి సాహురా బాహుబలి మోషన్ పోస్టర్ రిలీజ్..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2.ప్రభాస్,రానా,అనుష్క,

చైతు మూవీ ముహుర్తం గురించి ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

ప్రేమమ్ తో విజయం సాధించిన అక్కినేని నాగచైతన్య నెక్ట్స్ మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

బాహుబలి 2 ఫస్ట్ లుక్ అదిరింది..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2.ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా,

పెళ్లిచూపులు హీరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ డీటైల్స్..!

పెళ్లిచూపులు సినిమాతో అటు ఆడియోన్స్ లో,ఇటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.

నవంబర్18న మాస్ హీరో విశాల్ 'ఒక్కడొచ్చాడు'

మాస్ హీరో విశాల్-తమన్నా కాంబినేషన్ లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'.