close
Choose your channels

బాహుబలి 2 ఫస్ట్ లుక్ అదిరింది..!

Saturday, October 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న బాహుబ‌లి 2 లోగోను ఇటీవ‌ల రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ ను ప్ర‌భాస్ పుట్టిన‌రోజు కానుక గా ఒక రోజు ముందుగా అన‌గా ఈరోజు (22)న రిలీజ్ చేసారు. ముంబాయి ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో భాగ‌మైన మూవీ మేళ అనే కార్య‌క్ర‌మంలో బాహుబ‌లి2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డం విశేషం.
ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌మౌళి, ప్ర‌భాస్, అనుష్క‌, త‌మ‌న్నా, నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ త‌దిత‌రులు పాల్గొన్నారు. నాలుగు గంట‌ల‌కు రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆల‌స్యం అయ్యింది. ఎవ‌రూ అడ్డుకోలేని శ‌క్తితో మ‌హిష్మ‌తి సామ్రాజ్యాన్ని ఎలా గెలుచుకున్నాడు అనేదే బాహుబ‌లి 2 క‌థాంశం అని రాజ‌మౌళి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసి బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు కానుక‌గా రిలీజ్ చేసిన బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ లో ఓ చేతికి గొలుసు మ‌రో చేతిలో క‌త్తి దీనికి తోడు సిక్స్ ప్యాక్ తో ఉన్న‌ప్ర‌భాస్ పోస్ట‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.