close
Choose your channels

Manchu Lakshmi:103 డిగ్రీల జ్వరం.. గంట సేపు వెయిట్ చేయించారు , ఇదేం సర్వీస్ : ఇండిగోపై మంచు లక్ష్మీ ఆగ్రహం

Wednesday, March 8, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. సెలబ్రెటీలు, ప్రముఖులు, సామాన్య ప్రయాణీకులతో ఈ సంస్థ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమో లేదంటే సరైన సేవలు అందించకపోవడమో జరిగిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఇండిగోకు బాధితురాలిగా మారారు మంచు లక్ష్మీ. తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

బ్యాగ్ మరిచిపోయిన మంచు లక్ష్మీ :

కొద్దిరోజుల క్రితం లక్ష్మీ ప్రసన్న తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చారు. అయితే ఫ్లైట్ దిగే కంగారులో ఆమె విమానంలోనే తన బ్యాగ్ మరిచిపోయారు. ఆ విషయం గుర్తొచ్చి ఫ్లైట్ ఎక్కే ప్రయత్నం చేస్తుండగా ఇండిగో సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. మంచు లక్ష్మీ ఎంతగా చెప్పినా వారు పట్టించుకోలేదు.. దీంతో చేసేదేం లేక ఆమె అక్కడే గంట సేపు వెయిట్ చేశారు. అంతేకాదు.. ఆ సమయంలో లక్ష్మీ ఫీవర్‌తో బాధపడుతున్నారు. అయినప్పటికీ విమాన సిబ్బంది తనను పట్టించుకోలేదని.. ఆరోగ్యం బాగోకపోయినా తన పట్ల ఆ విధంగా ప్రవర్తించడంపై మంచు లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇండిగోను బ్యాన్ చేయాలన్న మోహన్ బాబు కుమార్తె:

గంటకు పైనే వెయిట్ చేసినా ఎవరూ స్పందించకపోవడం, గ్రౌండ్ డ్యూటీ స్టాఫ్ ఎవ్వరూ లేకపోవడంతో పాటు కనీసం కస్టమర్ సర్వీస్ అనేది లేకుండా ఎలా ఎయిర్‌లైన్స్‌ను నడుపుతున్నారంటూ మంచు లక్ష్మీ నిలదీశారు. అంతేకాదు.. #BanIndigo అంటూ ఓ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జతచేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఇండిగో సంస్థ స్పందించింది. తమ సిబ్బందితో దీనిపై ఆరా తీశామని.. వారు మీతో మాట్లాడతార, జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ట్వీట్ చేసింది.

మంత్రి రోజా, తదితరులను గాల్లో తిప్పిన ఇండిగో:

అయితే కొద్దిరోజుల క్రితం సాంకేతిక లోపం కారణంగా ఇండిగో విమానం గంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం తిరుపతిలో దిగకుండా మధ్యాహ్నం బెంగళూరులో ల్యాండ్‌ అయింది. సాంకేతిక సమస్యా, వాతావరణ సమస్యా అనేది చెప్పకపోవడంతో రెండు గంటల పాటు ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. విమానంలో మాజీ మంత్రి యనమల, టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇండిగో విమానం డోర్లు తెరుచుకోవడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజు.. ఇండిగోపై కేసువేస్తానని హెచ్చరించారు.

వీణ శ్రీవాణికి చేదు అనుభవం:

అలాగే ప్రముఖ సింగన్ వీణ శ్రీవాణికి సైతం ఇండిగో ఎయిర్‌లైన్స్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. లగేజీ కోసం తమ వద్ద నుంచి ఎక్స్‌ట్రా రుసుము వసూలు చేశారని.. కానీ గమ్యస్థానం చేరుకున్నా వారు తమ తమ బ్యాగ్‌లను, ఇతర సామాగ్రిని అందజేయలేదని శ్రీవాణి మండిపడ్డారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.