విష్ణు మంచు ఆచారి అమెరికా యాత్ర టీజర్ విడుదల!

  • IndiaGlitz, [Sunday,January 07 2018]

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర టీజర్ విడుదలైనది. కామెడీ ప్రధానంగా సాగే టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ లో వస్తుండటంతో చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

వీరిరువురు 'ఢీ', 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా' వంటి చిత్రాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే. ఇక జి.నాగేశ్వర్ రెడ్డి కలయికలో విష్ణు 'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించారు. ఆచారి అమెరికా యాత్ర' కూడా అదే తరహా వినోదాన్ని అందించనుంది నిర్మాతలు ధీమా వ్యక్తపరిచారు.

విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటిస్తున్నకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రాన్ని జనవరి 26 న విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు 'పద్మజ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు.

More News

'అన్నయ్య'కి 18 ఏళ్ళు

త‌మ్ముళ్ల‌ని ప్రాణం కంటే ఎక్కువ‌గా ప్రేమించే ఓ అన్న క‌థతో తెర‌కెక్కిన చిత్రం 'అన్నయ్య'. మెగాస్టార్‌ చిరంజీవి, సౌందర్య జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి  సెంటిమెంట్ చిత్రాల స్పెష‌లిస్ట్‌ ముత్యాల సుబ్బయ్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

'అజ్ఞాతవాసి' ట్రైలర్ రివ్యూ

జనవరి 10న పవన్,త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న చిత్రం 'అజ్ఞాతవాసి'.

మరో చిత్రంలో రకుల్, సాయిపల్లవి

కాంబినేషన్లను సెట్ చేయడంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సిద్ధహస్తులు.

'అజ్ఞాతవాసి' తో 'ఎం.ఎల్.ఎ.' వస్తున్నాడు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 25వ చిత్రం‘అజ్ఞాతవాసి’.

కీర్తి ఎక్కువ సార్లు చూసిన సినిమా అదేనట

టాలీవుడ్,కోలీవుడ్ లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతున్న కథానాయిక కీర్తి సురేష్.