మెగాస్టార్‌ను క‌లిసి మంచు హీరో.. కార‌ణం మ‌ళ్లీ చెబుతాడ‌ట‌... !

మెగాస్టార్ చిరంజీవికి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబుకి ఒకానొక సంద‌ర్భంలో మ‌న‌స్ప‌ర్ధ‌లు బాగానే ఉండేవి. అయితే క్ర‌మంగా ఇద్ద‌రూ ద‌గ్గ‌ర‌య్యారు. రెండు కుటుంబాలు క‌లిసిపోయాయి. రీసెంట్‌గా మంచు విష్ణు, చిరంజీవిని క‌లిశారు. ఆ ఫొటోను త‌న ట్విట్ట‌ర్‌లోనూ షేర్ చేశారు. ఈరోజు బిగ్‌బాస్‌ను క‌లిశాను. చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను అంటూ మంచు విష్ణు ట్వీట్ కూడా పెట్టారు. అయితే తాను మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు క‌లిశాన‌ని మాత్రం చెప్ప‌లేదు. త‌ర్వాత చెబుతాను అంటూ సింపుల్‌గా చెప్పేశాడు. దీంతో ఫిల్మ్ న‌గ‌ర్‌లో ప‌లు ర‌కాలుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం మంచు విష్ణు ప్యాన్ ఇండియా మూవీగా మోస‌గాళ్లు సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు స‌పోర్ట్ అందించే వ్య‌వ‌హారంలో చిరంజీవిని ప్ర‌త్యేకంగా క‌లిసి మంచు విష్ణు రిక్వెస్ట్ చేశాడని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

మోస‌గాళ్లు సినిమాను జెఫ్రీ చీ గిన్ డైరెక్ట్ చేశాడు. మంచు విష్ణు హీరోగా న‌టిస్తూ సినిమాను నిర్మిస్తున్నాడు. సునీల్ శెట్టి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా రుహానీ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

More News

కొత్త రకం కరోనా వేరియంట్ విషయమై గుడ్ న్యూస్!

కొత్త రకం కరోనా వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో పలు దేశాలు యూకేకు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి.

జిమ్‌కి వెళుతూ కారులో ఆ సినిమా పాటలు వింటూ ఉండేవాడిని: రామ్ చరణ్

లాక్‌డౌన్ ప్రారంభమైన తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీ కంటెంట్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.

కొత్త స్ట్రెయిన్ భారత్‌లో లేదు.. ఆందోళన వద్దు: కేంద్రం

పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది.

ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో కొత్త వేరియంట్ బారిన ఎవరూ పడలేదు: శ్రీనివాసరావు

యూకే నుంచి సోమవారం ఏడుగురు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చారని.. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు వెల్లడించారు.