close
Choose your channels

జిమ్‌కి వెళుతూ కారులో ఆ సినిమా పాటలు వింటూ ఉండేవాడిని: రామ్ చరణ్

Wednesday, December 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జిమ్‌కి వెళుతూ కారులో ఆ సినిమా పాటలు వింటూ ఉండేవాడిని: రామ్ చరణ్

లాక్‌డౌన్ ప్రారంభమైన తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీ కంటెంట్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. థియేటర్లు ఎప్పుడు పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయనే విషయం ఎవరికీ తెలియట్లేదు. ఈ క్రమంలో జనమంతా ఓటీటీకి ఎడిక్ట్ అయిపోయారు. దీంతో ఈ మధ్య కాలంలో విపరీతంగా వెబ్ సిరీస్‌కి క్రేజ్ పెరిగిపోయింది. ఈ బిజినెస్‌లోకి మెగా డాటర్‌ కూడా ఎంట్రీ ఇవ్వడం విశేషం. మెగాస్టార్‌ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్‌ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' అనే నిర్మాణ సంస్థను నెలకొల్పి.. తొలి ప్రయత్నంగా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' అనే టైటిల్‌తో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'లో డిసెంబర్ 25న ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.

కాగా.. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ సిరీస్ షో రీల్‌ను విడుదల చేశారు. ఆనంద్ రంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్, తేజా కాకుమాను తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయని 'జీ 5' వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. జీ 5 ఓటీటీకి హెడ్‌గా మాత్రమే కాకుండా... తన అక్క సుష్మిత, బావ విష్ణుకి మెంటార్‌గా ఉన్న ప్రసాద్ నిమ్మకాయలగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన 'ఓయ్'ని తాను చూశానన్నారు. జిమ్‌కి వెళుతూ ఎన్నో నెలలు ఆ సినిమాలో పాటలు కారులో వింటూ ఉండేవాడినని. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం అని చెర్రీ కొనియాడారు. ఆనంద్ రంగా సినిమాలు మిస్ అవుతున్నానన్నారు.

'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' షో రీల్ అద్భుతంగా ఉందని.. రియల్టీకి చాలా దగ్గరగా ఉందని చెర్రీ తెలిపారు. నటన విషయంలో, రియలిస్టిక్ లుక్ విషయంలో... నటీనటులు అందరూ బెస్ట్ ఇచ్చారన్నారు. మనమంతా ఏదైతే కోరుకుంటున్నామో అటువంటి ప్రాజెక్ట్ అని తెలిపారు. ప్లాస్టిక్ ఎరా ఆఫ్ ఫిలిం మేకింగ్ అయిపోయిందన్నారు. తేజ, నందినిరాయ్ కాంబో అదిరిపోయిందన్నారు. కరోనా మహమ్మారి కాలంలో 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు' టీమ్ అంతా బయటకు వచ్చి తమకు సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మనందరికీ ఈ ఏడాది చాలా కష్టంగా గడిచిందని.. ఈ ఏడాదిని ఎప్పటికీ మరువలేమన్నారు. ఈ ఏడాది నుంచి చాలా నేర్చుకున్నానని... ఇప్పుడు చిత్ర పరిశ్రమ మళ్లీ తన కాళ్ల మీద నిలబడిందన్నారు. ఎలా మొదలైంది అనేది కాదు.. ఏడాది ఎలా ముగిసిందనేది చాలా అంటే చాలా ముఖ్యమని రామ్ చరణ్ పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.