రామ్‌చరణ్‌కి అవార్డ్ రావాల్సిందన్న మంచు విష్ణు

  • IndiaGlitz, [Sunday,August 11 2019]

మెగాపవర్ స్టార్ నటించిన 'రంగస్థలం' తెలుగులో సెన్సేషనల్ హిట్ అయ్యింది. నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. రామ్‌చరణ్ నటన, సుకుమార్ టేకింగ్ సినిమాను మరో రేంజ్‌లో నిలిపాయి. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్, దేవిశ్రీ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించాయి. ఈ సినిమాలో రామ్‌చరణ్ నటనకు అవార్డు వస్తుందని అందరూ భావించారు. అయితే సౌండ్ విభాగంలో 'రంగస్థలం'కు జాతీయ అవార్డుని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో మెగాభిమానులు నిరాశపడ్డారు.

అయితే దీనిపై మంచు విష్ణు తన స్పందనను ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ''జాతీయ అవార్డులు గెలుచుకున్న వారితో నాకెలాంటి విబేధాల్లేవ్. కానీ రంగస్థలంలోని నటనకు సోదరుడు రామ్‌చరణ్ ఉత్తమనటుడిగా అన్ని విధాల అర్హుడు. నా అభిప్రాయాన్ని నిజాయతీగా చెబుతున్నా.. చరణ్ ఆ చిత్రంలో ఉత్తమ నటనను కనపరిచారు. ఇటీవల కాలంలో మరే నటుడిలోనూ అలాంటి నటనను చూడలేదు. అయినా ప్రేక్షకుల ప్రేమాభిమానాలే పెద్ద అవార్డ్'' అంటూ తెలియజేశారు మంచు విష్ణు.