close
Choose your channels

రామ్‌చరణ్‌కి అవార్డ్ రావాల్సిందన్న మంచు విష్ణు

Sunday, August 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్‌చరణ్‌కి అవార్డ్ రావాల్సిందన్న మంచు విష్ణు

మెగాపవర్ స్టార్ నటించిన `రంగస్థలం` తెలుగులో సెన్సేషనల్ హిట్ అయ్యింది. నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. రామ్‌చరణ్ నటన, సుకుమార్ టేకింగ్ సినిమాను మరో రేంజ్‌లో నిలిపాయి. ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్, దేవిశ్రీ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించాయి. ఈ సినిమాలో రామ్‌చరణ్ నటనకు అవార్డు వస్తుందని అందరూ భావించారు. అయితే సౌండ్ విభాగంలో `రంగస్థలం`కు జాతీయ అవార్డుని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో మెగాభిమానులు నిరాశపడ్డారు.

అయితే దీనిపై మంచు విష్ణు తన స్పందనను ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ``జాతీయ అవార్డులు గెలుచుకున్న వారితో నాకెలాంటి విబేధాల్లేవ్. కానీ రంగస్థలంలోని నటనకు సోదరుడు రామ్‌చరణ్ ఉత్తమనటుడిగా అన్ని విధాల అర్హుడు. నా అభిప్రాయాన్ని నిజాయతీగా చెబుతున్నా.. చరణ్ ఆ చిత్రంలో ఉత్తమ నటనను కనపరిచారు. ఇటీవల కాలంలో మరే నటుడిలోనూ అలాంటి నటనను చూడలేదు. అయినా ప్రేక్షకుల ప్రేమాభిమానాలే పెద్ద అవార్డ్`` అంటూ తెలియజేశారు మంచు విష్ణు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.