బాల‌య్య కోసం మాస్ బీట్స్‌

  • IndiaGlitz, [Friday,November 17 2017]

'కంచె' సినిమాతో తనలోని ప్ర‌తిభ‌ని చాటిన మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్. న‌ట‌సింహ బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకి కూడా చిరంతన్‌నే సంగీతం అందించాడు. ఆ సినిమాకి చిరంత‌న్ అందించిన బాణీలకు బాలయ్య ఫిదా అయిపోయారు. అందుకే తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ జై సింహా'ని కూడా చిరంతన్ చేతిలో పెట్టాడు.

దానికి త‌గ్గ‌ట్టే బాలయ్య నమ్మకాన్ని వమ్ము చేయలేదనే చెప్తున్నాడీ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే 'జై సింహా' సినిమాకి సంబంధించి బాలయ్య గత చిత్రాల మాదిరిగా.. మంచి మాస్ బీట్స్ ఉన్న ట్రాక్స్ ని, అలాగే రొమాంటిక్ మ్యూజిక్ ని కమర్షియల్ గా కంపోజ్‌ చేసినట్టు చిరంతన్ చెప్పాడు.

డిసెంబర్ నెలాఖరులో ఆడియో లాంచ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వచ్చే జనవరి 12న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. న‌య‌న‌తార‌, హ‌రిప్రియ ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

More News

త‌మిళ్ సినిమాలో నిహారిక ఫ‌స్ట్‌లుక్

గ‌తేడాది విడుద‌లైన ఒక మ‌నసుతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది మెగా బ్ర‌ద‌ర్  నాగ‌బాబు కుమార్తె కొణిదెల నిహారిక‌. ఆ సినిమాతో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా ప్రిన్సెస్‌.. ప్ర‌స్తుతం యువ క‌థానాయ‌కుడు సుమంత్ అశ్విన్‌తో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేస్తోంది.

అల‌రించేలా 'హ‌లో' టీజ‌ర్‌

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'హలో' మూవీ టీజర్ వచ్చేసింది. "ది లక్కీయ‌స్ట్‌ పీపుల్ బోర్న్ ఆన్ థిస్ ఎర్త్, వాళ్ళు మాత్రం.. ఎవరేం చేసినా ఏం అడ్డొచ్చినా తమ‌ సోల్ మేట్ ని కలుస్తారు, లైఫ్ ని షేర్ చేసుకుంటారు." అంటూ నాగార్జున అందించిన వాయిస్ ఓవర్ బాగుంది.

నంది అవార్డులపై స్పందించిన నిర్మాత మల్కాపురం శివకుమార్

ఇటీవల ప్రకటించిన మూడు సంవత్సరాల నంది అవార్డులు పచ్చపార్టీ తమ కార్యకర్తలకు కండువాలను కప్పినట్లుగా కప్పింది. అవార్డులకు అర్హత వున్న చిత్రాలను విస్మరించి తమకు అనుకూలంగా వున్న వారికే అవార్డులను పంచిపెట్టింది అంటున్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్.

నిజ ఘటన..క్లిష్టమైన కేసు ఆధారంగా తెరకెక్కిన 'ఖాకి'

కార్తి, రకుల్ జంటగా నటించిన చిత్రం `ఖాకి`. ఈ సినిమా నవంబర్ 17న విడుదలవుతోంది. 1995-2005 బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాను దర్శకుడు వినోద్ ఓ నిజఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.

జనవరి 13న విశాల్‌ కొత్త చిత్రం 'అభిమన్యుడు'

పందెం కోడి నుంచి డిటెక్టివ్‌ వరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు చేసిన మాస్‌ హీరో విశాల్‌ 'డిటెక్టివ్‌' పెద్ద హిట్‌ అయిన ఆనందంలో వున్నారు. డిటెక్టివ్‌ 2 కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు మాస్‌ హీరో విశాల్‌, సమంత జంటగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి 'అభిమన్యుడు' టైటిల్‌ని ఖరారు చేశా