close
Choose your channels

నిజ ఘటన..క్లిష్టమైన కేసు ఆధారంగా తెరకెక్కిన 'ఖాకి'

Thursday, November 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కార్తి, రకుల్ జంటగా నటించిన చిత్రం `ఖాకి`. ఈ సినిమా నవంబర్ 17న విడుదలవుతోంది. 1995-2005 బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాను దర్శకుడు వినోద్ ఓ నిజఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. పోలీసులకు సవాలుగా మారిన ఓ కేసుని వారు..పదేళ్లు కష్టపడి చేధించిన తీరుని సినిమా రూపంలో 'ఖాకి' రూపంంలో ఆవిష్కృతం కానుంది.

ఈ సినిమా ట్రైలర్ చూస్తే..నలుగురు ఫింగర్ ప్రింట్స్.. వంద కోట్ల మందిలో ఎవరికి మ్యాచ్ అవుతుందో తెలుసుకోవడం ఎలా అని ఓ పోలీసు వేసే ప్రశ్నలో సినిమా ఎలాంటి సీరియస్ కాన్సెప్ట్తో తెరకెక్కిందో అర్థం చేసుకోవచ్చు.

తొలిసారి నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న ఆదిత్య మ్యూజిక్స్ అధినేతలు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లా భారీ రేంజ్లో విడుదల చేస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలను మించేలా సినిమా ఉంటుందని యూనిట్ వర్గాలు ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.