close
Choose your channels

Ram Charan And Upasana:ఉపాసన వెనుక బ్యాగులు మోసుకుంటూ చెర్రీ .. ఏం చేస్తాం, ఎంతటి స్టార్ హీరో అయినా ఇది తప్పదంటూ కామెంట్స్

Wednesday, March 8, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎంతటి వాడైనా కాంతా దాసుడే అన్నారు పెద్దలు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరినైనా సరే.. చుట్టూ తిప్పుకోగల సమ్మోహన శక్తి స్త్రీ సొంతం. అలాగే ఎంతటి మగాడినైనా తన ముందు తలవంచేలా చేయగలదు. ఈ విషయం తరతరాలుగా రుజువు అవుతూనే వుంది. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు చెబుతున్నామంటే.. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ ఇప్పుడు అమెరికాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్:

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలోని ‘‘నాటు నాటు’’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్స్‌కు నామినేట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 భాషల సినిమాలు షార్ట్ లిస్ట్ కాగా.. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సినిమాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ అవార్డుల కమిటీ తుది జాబితాకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. లగాన్ తర్వాత ఓ భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఇకపోతే.. డాక్కుమెంటరీ ఫీచర్ కేటగిరీలో షానూక్‌సేన్ ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి.

అమెరికాలో మకాం వేసిన ఆర్ఆర్ఆర్ యూనిట్:

ఆస్కార్ నామినేషన్స్‌లో నిలవడంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం అమెరికాలో సందడి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కార్ కొట్టి తీరాలన్న కసితో జక్కన్న పనిచేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మీడియాతో పాటు హాలీవుడ్ ప్రముఖులతో రాజమౌళి భేటీ అవుతున్నారు. అలాగే హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా, నందమూరి అభిమానులతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తన వంతుగా ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ వచ్చేందుకు శ్రమిస్తున్నారు చెర్రీ. హాలీవుడ్ మీడియాకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆయన వెంట భార్య ఉపాసన కూడా వున్నారు. బిజీగా వున్నప్పటికీ తన స్వీట్ హార్ట్ కోసం కాస్త వీలు కుదుర్చుకుని ఆమెను బయటకు తీసుకెళ్లాడు. అయితే షాపింగ్ ముగిశాక ఉపాసన ముందుకు వెళ్తుండగా.. చరణ్ బ్యాగులు మోసుకుంటూ ఆమె వెనుకే వస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు.. ఎంతటి స్టార్ హీరోలైనా భార్య బ్యాగులు మోయాల్సిందేనంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.