Actress Radha : 50 ప్లస్‌లోనూ రాధ డ్యాన్సుల్లో తగ్గని గ్రేస్... చిరు, వెంకీ ఫిదా

80వ దశకంలో డ్యాన్సులు, ఫైట్స్‌తో తెలుగు తెరపైకి దూసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి వరకు మూసలో కొట్టుమిట్టాడుతోన్న టాలీవుడ్‌కు సరికొత్త దారి చూపి సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా ఎదిగారు. ఆ రోజుల్లో ఆయనతో డ్యాన్సులు చేయాలంటే హీరోయిన్లు కాస్త ఇబ్బందిపడేవారు. కానీ చిరంజీవిని సైతం భయపెట్టే హీరోయిన్లు కొందరు వుండేవారు. వారిలో మాధవి, భానుప్రియ, రాధ, రాధిక, విజయశాంతిలు మెగాస్టార్‌తో సమానంగా డ్యాన్సులు చేసేవారు. తెరపై వీరిని చూసేందుకు ప్రేక్షకులు కూడా ఉత్సాహం చూపారు. వయసు మీద పడుతున్నప్పటికీ వీరు నేటికి కుర్ర హీరోహీరోయిన్లతో సమానంగా డ్యాన్సులు చేయగలరు. ఉదాహరణకు చిరంజీవినే తీసుకుంటే.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆయన డ్యాన్సులు చితక్కొడుతున్నారు.

సీటులోంచి లేచొచ్చి రాధను అభినందించిన చిరు, వెంకీ:

తాజాగా అలనాటి హీరోయిన్ రాధ 60లకు చేరువ అవుతున్నా తన డ్యాన్స్‌లో గ్రేస్ తగ్గలేదని నిరూపించుకున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల దక్షిణాదికి చెందిన 80వ దశకం నాటి తారలు ముంబైలో గెటు టు గెదర్ పార్టీ నిర్వహించారు. వీరికి బాలీవుడ్ స్టార్స్ జాకీష్రాఫ్, పూనమ్ థిల్లాన్‌లు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఆటపాటలతో సీనియర్స్ సందడి చేశారు. ఈ క్రమంలోనే రాధ తన డ్యాన్స్‌తో అలరించారు. ఓ హిందీ పాటకు రాధ స్టెప్పులు వేయగా.. మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. అంతేకాదు స్వయంగా సీట్లో నుంచి లేచి వచ్చి మరీ ఆమెను అభినందించారు. వెంకటేశ్ కూడా రాధకు కాంప్లిమెంట్ ఇచ్చారు. ప్రస్తుతం రాధ డ్యాన్సుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వ్యాపారవేత్తను పెళ్లాడిన రాధ:

ఇకపోతే.. సౌత్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సమయంలోనే 1991లో ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖరన్ నాయర్‌ను రాధ పెళ్లాడారు. ఈ దంపతులకు కార్తీక నాయర్, తులసీ నాయర్‌లు సంతానం. వీరిద్దరూ కూడా సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 2021లో రాధ తన భర్తతో కలిసి బీజేపీలో చేరారు.

More News

BiggBoss: బిగ్‌బాస్ ఇంట్లో ఆదిరెడ్డి భార్య, రాజ్ తల్లి.... రేవంత్, కీర్తి, రోహిత్‌ల కంటతడి

బిగ్‌బాస్ 6 తెలుగు విజయవంతంగా 12వ వారంలోకి ప్రవేశించింది. ఎన్నో విమర్శలు, ట్రోలింగ్‌ను తట్టుకుని ఇక్కడి వరకు వచ్చింది.

Prema Desam: 'ప్రేమ దేశం' అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే మూవీ.. మధుబాల

త్రిగున్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ప్రేమ దేశం'. 'శ్రీ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్ పై శిరీష సిద్ధం ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.

'18 పేజిస్' చిత్రం నుండి క్లాసీ మెలోడీ 'నన్నయ్య రాసిన' లిరికల్ వీడియో విడుదల

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం "18 పేజిస్" నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న

Dahini - Mantragatte: ఆస్ట్రేలియా టైటాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ పెస్టివ‌ల్‌లో బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌గా ‘దహిణి - మంత్రగత్తె’

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో విలక్ష‌ణ చిత్రం ‘దహిణి - మంత్ర‌గ‌త్తె’.

Meet Cute: 'మీట్ క్యూట్' ప్లెజంట్ వెబ్ సిరీస్ గా ఆకట్టుకుంటుంది - నాని

నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ మీట్ క్యూట్.