close
Choose your channels

Actress Radha : 50 ప్లస్‌లోనూ రాధ డ్యాన్సుల్లో తగ్గని గ్రేస్... చిరు, వెంకీ ఫిదా

Wednesday, November 23, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

80వ దశకంలో డ్యాన్సులు, ఫైట్స్‌తో తెలుగు తెరపైకి దూసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి వరకు మూసలో కొట్టుమిట్టాడుతోన్న టాలీవుడ్‌కు సరికొత్త దారి చూపి సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా ఎదిగారు. ఆ రోజుల్లో ఆయనతో డ్యాన్సులు చేయాలంటే హీరోయిన్లు కాస్త ఇబ్బందిపడేవారు. కానీ చిరంజీవిని సైతం భయపెట్టే హీరోయిన్లు కొందరు వుండేవారు. వారిలో మాధవి, భానుప్రియ, రాధ, రాధిక, విజయశాంతిలు మెగాస్టార్‌తో సమానంగా డ్యాన్సులు చేసేవారు. తెరపై వీరిని చూసేందుకు ప్రేక్షకులు కూడా ఉత్సాహం చూపారు. వయసు మీద పడుతున్నప్పటికీ వీరు నేటికి కుర్ర హీరోహీరోయిన్లతో సమానంగా డ్యాన్సులు చేయగలరు. ఉదాహరణకు చిరంజీవినే తీసుకుంటే.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆయన డ్యాన్సులు చితక్కొడుతున్నారు.

సీటులోంచి లేచొచ్చి రాధను అభినందించిన చిరు, వెంకీ:

తాజాగా అలనాటి హీరోయిన్ రాధ 60లకు చేరువ అవుతున్నా తన డ్యాన్స్‌లో గ్రేస్ తగ్గలేదని నిరూపించుకున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల దక్షిణాదికి చెందిన 80వ దశకం నాటి తారలు ముంబైలో గెటు టు గెదర్ పార్టీ నిర్వహించారు. వీరికి బాలీవుడ్ స్టార్స్ జాకీష్రాఫ్, పూనమ్ థిల్లాన్‌లు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఆటపాటలతో సీనియర్స్ సందడి చేశారు. ఈ క్రమంలోనే రాధ తన డ్యాన్స్‌తో అలరించారు. ఓ హిందీ పాటకు రాధ స్టెప్పులు వేయగా.. మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. అంతేకాదు స్వయంగా సీట్లో నుంచి లేచి వచ్చి మరీ ఆమెను అభినందించారు. వెంకటేశ్ కూడా రాధకు కాంప్లిమెంట్ ఇచ్చారు. ప్రస్తుతం రాధ డ్యాన్సుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వ్యాపారవేత్తను పెళ్లాడిన రాధ:

ఇకపోతే.. సౌత్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సమయంలోనే 1991లో ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖరన్ నాయర్‌ను రాధ పెళ్లాడారు. ఈ దంపతులకు కార్తీక నాయర్, తులసీ నాయర్‌లు సంతానం. వీరిద్దరూ కూడా సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 2021లో రాధ తన భర్తతో కలిసి బీజేపీలో చేరారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.