‘‘ మీరు ఇంటికి తిరిగి రావాలి.. సెలబ్రేట్‌ చేసుకోవాలి’’.. కైకాల ఆరోగ్యంపై చిరు ట్వీట్

  • IndiaGlitz, [Sunday,November 21 2021]

దిగ్గజ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యంపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడానని, తన మాటలకు కైకాల స్పందిస్తున్నారని చిరు తెలిపారు. ఈ మేరకు కైకాల ఆరోగ్యంపై ఆయన ఓ ట్వీట్‌ చేశాడు.

‘ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలియగానే క్రిటికల్‌ కేర్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, ‘త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలి’అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్‌అప్‌ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్‌ సుబ్బారెడ్డి నాతో చెప్పారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చిరంజీవి పేర్కొన్నారు.

మరోవైపు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని .. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని తెలిపారు.

More News

యాక్షన్ థ్రిల్లర్ 'రామ్ అసుర్' సినిమాకి సూపర్ రెస్పాన్స్

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన చిత్రం రామ్ అసుర్. అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్  కథానాయకులుగా

ఘనంగా “ఆర్ఎక్స్100” హీరో కార్తీకేయ వివాహం.. హాజరైన మెగాస్టార్ చిరంజీవి

యువ హీరో, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు లోహిత మెడలో మూడుముళ్లు వేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: షణ్ముఖ్, సిరిలను బయటకు వెళ్లిపోమన్న నాగ్.. యానీ మాస్టర్‌కు క్లాస్

బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం కావడంతో ఎప్పటిలాగే నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు కూడా నాగార్జున హౌస్‌ మేట్స్‌కి బాగానే క్లాస్‌ పీకాడు.

అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్ధితి.. హెల్త్ బులెటిన్ విడుదల

దిగ్గజ న‌టుడు కైకాల స‌త్యనారాయ‌ణ (86) ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంది.

ఆడపడుచులపై దూషణలు.. అరాచక పాలనకు నాందీ : ఏపీ అసెంబ్లీ ఘటనపై ఎన్టీఆర్ ఎమోషనల్

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శుక్రవారం సభలో జరిగిన పరిణామాలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.