కాలం, దేశం మారినా మేం మారలేదంటోన్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న పోస్ట్‌లు అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతున్నాయి. తాజాగా.. ఆయ‌న పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 1990లో చిరంజీవి వంట చేస్తుండ‌గా సురేఖ ఆయ‌న వెనుక నిల‌బ‌డి ఉన్నారు. ఇది అమెరికాలో జ‌రిగింది. దాదాపు ముప్పై ఏళ్ల త‌ర్వాత అదే సీన్ రిపీట‌య్యింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనే ఆయ‌న వంట చేస్తుంటే సురేఖ ఆయ‌న వెనుక నిల‌బ‌డి చూస్తున్నారు. కాలం మారినా, దేశం మారినా మేం మార‌లేదు అంటూ చిరు కామెంట్ పెట్టారు. అంతే కాకుండా 1990 నాటి ఫొటోకు జాయ్‌ఫుల్ హాలీడే ఇన్ అమెరికా, ప్రెజెంట్ ఫొటోను జైల్‌ఫుల్ హాలీడే క‌రోనా అనే క్యాప్ష‌న్స్ కూడా ఇచ్చారు చిరంజీవి. ఈ ఫొటో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

ప్ర‌స్తుతం చిరంజీవి త‌న 152వ చిత్రం ఆచార్య‌తో బిజీగా ఉన్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్నఈ చిత్రం ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావంతో ఆగింది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

More News

తార‌క్ ఫ్యాన్స్‌కు షాక్‌...

మే 20న తార‌క్ పుట్టిన‌రోజు. ఈ రోజు కోసం తార‌క్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు కార‌ణం ‘రౌద్రం ర‌ణం రుధిరం (ఆర్ఆర్ఆర్‌)’. భారీ అంచనాల నడుమ తెరుకెక్కుతోన్న

డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు సూర్య కౌంట‌ర్‌!!

క‌రోనా ప్ర‌భావంతో ఇప్పుడు నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌స్థ‌లో గొడ‌వ‌లు త‌లెత్తాయి. ముఖ్యంగా హీరో సూర్య డిస్ట్రిబ్యూట‌ర్స్, థియేట‌ర్స్ ఓన‌ర్స్ నుండి ఓ రేంజ్ బెదిరింపుల‌నే ఎదుర్కొన్నారు.

ఎన్టీఆర్ క‌థ‌నే ప‌వ‌న్ ఒప్పుకున్నాడా?

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడు వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ సినిమాతో పాటు

మే-31 వరకు లాక్‌డౌన్ 4.0 .. మార్గదర్శకాలివే..

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దాని కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.

లాక్‌ డౌన్‌ 4.0కు కేంద్రం సిద్ధం.. రేపే మార్గదర్శకాలు!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం విదితమే. రేపటితో అనగా ఆదివారం మే-17తో 3.0 లాక్‌డౌన్‌ను ఇండియా పూర్తి చేసుకోనుంది.