మెట్రో మూవీ సాంగ్ లో గీతామాధురి

  • IndiaGlitz, [Friday,November 25 2016]

టాలీవుడ్ క్రేజీ సింగ‌ర్‌ గీతామాధురి త్వ‌ర‌లో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైన‌మిక్ సింగ‌ర్ న‌టించే ఆ సినిమా ఏది? అన్న ఆస‌క్తి క‌న‌బ‌రిచారంతా. ఏదైతేనేం గీతామాధురి న‌టించిన సినిమా డీటెయిల్స్ వ‌చ్చేశాయి. డైన‌మిక్ సింగ‌ర్ స్టైల్‌ని ఎలివేట్ చేస్తూ కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి.
గీతామాధురి ఎంట్రీ ఇస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ మూవీ మెట్రో. ఇటీవ‌లే స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ఫెంటాస్టిక్ నేరేషన్‌తో తెర‌కెక్కిన చిత్రంగా ఈ సినిమా పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ర‌క్తిక‌ట్టించే ఈ చిత్రం తెలుగులోనూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని ఆయ‌న అన్నారు. అలాంటి క్రేజీ మూవీ మెట్రోలో ఓ సాంగ్‌లో గీతామాధురి త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నారు. ఎంతో శ్రావ్యంగా సాగే ఈ మెలోడీ పాట‌ను తాను స్వ‌యంగా ఆల‌పించడ‌మే గాకుండా త‌న‌దైన శైలిలో అభిన‌యించారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ... అతి త్వ‌ర‌లోనే 'మెట్రో' తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. గీతామాధురి ఆల‌పించిన ఆ మెలోడీ సాంగ్ సినిమాకి పెద్ద అస్సెట్‌. ఈ ట్యాలెంటెడ్ సింగ‌ర్ స్వ‌యంగా పాడ‌ట‌మే గాకుండా అభిన‌యించారు. ఈ సినిమాలో అన్ని పాట‌లు సంద‌ర్భానుసారం వ‌స్తూ వేటిక‌వే ప్ర‌త్యేకంగా అల‌రిస్తాయి. ఈ రోజు గీతా మాధురికి సంబంధించిన స్టిల్స్ ను రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ....వ‌ర్ధ‌మాన గాయ‌ని గీతామాధురి ఆల‌పించి నటించిన‌ ఈ గీతం సినిమాలో వెరీ స్పెష‌ల్‌. మేకింగ్ ప‌రంగా విజువ‌లైజేష‌న్ ప‌రంగా వండ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. క్రియేటివ్ మేకింగ్ క‌నిపిస్తుంది. ఈ సీజ‌న్‌లో పెద్ద హిట్ట‌య్యే చిత్ర‌మిది. ఇటీవ‌లే డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫైన‌ల్ మిక్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.
ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ఏ4 ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై ర‌జ‌నీ తాళ్లూరి నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

More News

హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన నిఖిల్..!

విభిన్న కథా చిత్రాలతో వరుస విజయాలు సాధిస్తున్నయువ కథానాయకుడు నిఖిల్.

11 ఏళ్ల తర్వాత ప్రభుదేవా చేస్తున్నాడా..!

అభినేత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా

నాగ్ రాజు గారి గది 2 డీటైల్స్..!

నవరస సమ్రాట్ నాగార్జున ప్రస్తుతం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నటిస్తున్నారు.

'కావలై వేండాం' (ఎంతవరకు ఈ ప్రేమ) బ్లాక్ బస్టర్ హిట్ - డి.వెంకటేష్

తెలుగు వెర్షన్ రిలీజ్ కి తగినంత సమయం ఇవ్వకుండా హ్యాండిచ్చినా...తమిళ వెర్షన్ 'కావలై వేండాం'బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం చాలా సంతోషాన్నిచ్చింది.

చ‌ర‌ణ్ - సుకుమార్ మూవీ అప్ డేట్స్..!

రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ధృవ డిసెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్ సుకుమార్ తో మూవీ చేయ‌నున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.