close
Choose your channels

మెట్రో మూవీ సాంగ్ లో గీతామాధురి

Friday, November 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ క్రేజీ సింగ‌ర్‌ గీతామాధురి త్వ‌ర‌లో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైన‌మిక్ సింగ‌ర్ న‌టించే ఆ సినిమా ఏది? అన్న ఆస‌క్తి క‌న‌బ‌రిచారంతా. ఏదైతేనేం గీతామాధురి న‌టించిన సినిమా డీటెయిల్స్ వ‌చ్చేశాయి. డైన‌మిక్ సింగ‌ర్ స్టైల్‌ని ఎలివేట్ చేస్తూ కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి.
గీతామాధురి ఎంట్రీ ఇస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ మూవీ మెట్రో. ఇటీవ‌లే స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ఫెంటాస్టిక్ నేరేషన్‌తో తెర‌కెక్కిన చిత్రంగా ఈ సినిమా పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ర‌క్తిక‌ట్టించే ఈ చిత్రం తెలుగులోనూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని ఆయ‌న అన్నారు. అలాంటి క్రేజీ మూవీ మెట్రోలో ఓ సాంగ్‌లో గీతామాధురి త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నారు. ఎంతో శ్రావ్యంగా సాగే ఈ మెలోడీ పాట‌ను తాను స్వ‌యంగా ఆల‌పించడ‌మే గాకుండా త‌న‌దైన శైలిలో అభిన‌యించారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ... అతి త్వ‌ర‌లోనే `మెట్రో` తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. గీతామాధురి ఆల‌పించిన ఆ మెలోడీ సాంగ్ సినిమాకి పెద్ద అస్సెట్‌. ఈ ట్యాలెంటెడ్ సింగ‌ర్ స్వ‌యంగా పాడ‌ట‌మే గాకుండా అభిన‌యించారు. ఈ సినిమాలో అన్ని పాట‌లు సంద‌ర్భానుసారం వ‌స్తూ వేటిక‌వే ప్ర‌త్యేకంగా అల‌రిస్తాయి. ఈ రోజు గీతా మాధురికి సంబంధించిన స్టిల్స్ ను రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ....వ‌ర్ధ‌మాన గాయ‌ని గీతామాధురి ఆల‌పించి నటించిన‌ ఈ గీతం సినిమాలో వెరీ స్పెష‌ల్‌. మేకింగ్ ప‌రంగా విజువ‌లైజేష‌న్ ప‌రంగా వండ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. క్రియేటివ్ మేకింగ్ క‌నిపిస్తుంది. ఈ సీజ‌న్‌లో పెద్ద హిట్ట‌య్యే చిత్ర‌మిది. ఇటీవ‌లే డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫైన‌ల్ మిక్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.
ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ఏ4 ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై ర‌జ‌నీ తాళ్లూరి నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.