close
Choose your channels

ముమైత్ మోసం చేసింది: క్యాబ్ డ్రైవర్

Tuesday, September 29, 2020 • తెలుగు Comments

ముమైత్ మోసం చేసింది: క్యాబ్ డ్రైవర్

నటి ముమైత్ ఖాన్ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక క్యాబ్ డ్రైవర్‌కు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. దీంతో క్యాబ్ డ్రైవర్ సాక్ష్యాధారాలతో సహా సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో నెటిజన్లు ముమైత్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ రాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. మూడు రోజుల గోవా పర్యటన నిమిత్తం ముమైత్ కారు బుక్ చేసుకుంది. ఆ తరువాత మూడు రోజులను కాస్తా ఎనిమిది రోజుల పాటు పొడిగించింది.

టోల్‌గేట్ నుంచి డ్రైవర్ అకామిడేషన్ వరకూ దేనికి డబ్బులు ఇవ్వలేదని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ముమైత్ తనకు 15 వేల రూపాయల వరకూ ఎగ్గొట్టిందని సోషల్ మీడియా వేదికగా వాపోయాడు. తనకు జరిగిన అన్యాయం మరో డ్రైవర్‌కు జరగకూడదని వెల్లడించాడు. ఈ ఘటనపై ముందుగా క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌తో చర్చిస్తానని.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రాజు వెల్లడించాడు.

ఇక రాజు.. టోల్‌గేట్ దగ్గర కట్టిన డబ్బులు తాలూకు రిసిప్ట్స్‌, ముమైత్‌తో కలిసిన దిగిన ఫొటోలు, ఆమెతో చేసిన వాట్సాప్ చాట్‌ను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ముమైత్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయమై ఇంతవరకూ ముమైత్ స్పందించలేదు.

Get Breaking News Alerts From IndiaGlitz