'బంగారి బాలరాజు' మూవీలో ముంబై ఐటంగర్ల్ శాంతాబాయ్

  • IndiaGlitz, [Thursday,January 18 2018]

నంది క్రియేషన్స్ బ్యానర్ పై కె. ఎండి. రఫీ మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా, కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు". ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... మొదటి షెడ్యూల్ అహో బిలం లో 15 రోజుల పాటు షూటింగ్ చేసుకుని, ఇప్పుడు సారథి స్టూడియోస్ లో స్పెషల్ సాంగ్ జరుపుకుంది. ఈ సాంగ్ లో శాంతాబాయ్ పాటతో ఒక్కసారిగా యూత్ ను తనవైపు లాగేసుకున్న లేటెస్ట్ హాట్ బాంబ్ రాధికా పాటిల్ ను మా ఈ బంగారి బాలరాజు చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాము. ప్రముఖ సింగర్ గీతామాధురి పాడిన ఈ పాటకి రాధిక తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో చిత్రానికి మరింత గ్లామర్ తీసుకొచ్చింది.

ఈ చిత్రం విషయానికి వస్తే... పరువు, ప్రతిష్టల మధ్య సాగే సున్నితమైన ప్రేమకధతో తెరకెక్కుతోంది. రాయలసీమలో జరిగిన ఓ యదార్ధ కథ ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమ కథ మా ఈ "బంగారి బాలరాజు". ఈ జనవరి చివరి వారం లో టీజర్ ని విడుదల చేయబోతున్నాము. అలాగే ఈ టీజర్ తో మా హీరో, హీరోయిన్ లను కూడా పరిచయం చేయబోతున్నాము అని దర్శకుడు తెలిపారు. ప్రొడ్యూసర్ రఫీ మాట్లాడుతూ... మా డైరెక్టర్ కోటేంద్ర గారు తను ఏం చెప్పారో అది చేయడమే కాకుండా, అనుకున్నదానికంటే తక్కువ టైంలోనే చిత్రాన్ని పూర్తి చేస్తుండడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఔట్ పుట్ చూసాము చాలా హ్యాపీ గా ఉంది. శాంతాబాయ్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది అని తెలిపారు.

నటీనటులు – రాఘవ్, కరాణ్య కత్రీన్, మీనాకుమారి, దూకుడు శ్రవణ్, ఎన్.వి. చౌదరి, సారిక రామచంద్రరావు, కిరాక్ ఆర్.పి, జబర్దస్త్ బాబి, బి.వి. చౌదరి, సుదర్శన్ దోర్నాల్, జయభారత్ రెడ్డి. సాంకేతిక వర్గం – సంగీతం : చిన్నికృష్ణ - చిట్టిబాబు రెడ్డిపోగు, కెమెరా : జి.ఎల్. బాబు, ఆర్ట్ : కృష్ణమాయ, కో డైరెక్టర్ : హేమంత్ కుమార్, పి. ఆర్. ఓ : కడలి రాంబాబు, నిర్మాతలు : కె.ఎండి. రఫి మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి, కథ,మాటలు,స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : కోటేంద్ర దుద్యాల.

More News

విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ర‌వితేజ 'ట‌చ్ చేసి చూడు'!

మాస్ మహారాజా రవితేజ హీరోగా న‌టించిన‌ 'టచ్ చేసి చూడు' చిత్రాన్నిఅతి  త్వరలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.  బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన  విక్రమ్ సిరికొ&

మోహన్ బాబు కు 'విశ్వ నట సార్వభౌమ' బిరుదు ప్రధానం

తెలుగులో పదునైన డైలాగులు సంధించడంలో తనకు తానే సాటి అని మోహన్‌బాబు రుజువు చేసుకున్నారు. ఆయన డైలాగ్‌లు వినే వాళ్లను మంత్రుముగ్ధుల్ని చేసే శక్తి మోహన్‌బాబు సొంతం. ఆయనకు కొంచెం కోపం కూడా వుంది. నాకు బాగా తెలుసు. ఒక శాతం కోపం వుంటే 99 శాతం ఆయనలో మంచితనం వుంది. 42 ఏళ్ల సినీ ప్రస్థానంలో 560కి పైచిలుకు చిత్రాల్లో నటించి ఎందరినో మెప్పించారు.

జ‌న‌వ‌రి 20న వ‌రుణ్ తేజ్ 'తొలి ప్రేమ‌' ఆడియో

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతున్న చిత్రం 'తొలిప్రేమ‌'. రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. యువ ద‌ర్శకుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేస్తున్నారు.

బాల‌య్య నిర్మాత‌గా.. బోయ‌పాటి చిత్రం?

న‌ట‌సింహ‌ నంద‌మూరి బాల‌కృష్ణ‌, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుందంటే.. బాక్సాఫీస్‌కి కొత్త ఊపు వ‌స్తుంది. సింహా, లెజెండ్.. ఇలా ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన రెండు సినిమాలు కూడా కాసుల గ‌ల‌గ‌ల‌లు వినిపించాయి.

ప్ర‌భాస్‌కి జోడీగా దీపికా ప‌దుకునే?

'బాహుబ‌లి' చిత్రాల‌తో..భార‌తీయ సినిమాపై చెర‌గ‌ని సంత‌కం చేశారు ప్ర‌భాస్‌. ఆ చిత్రాల సంచ‌ల‌న విజ‌యాల‌తో.. ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఇండియ‌న్ సినిమాగా నిలిచారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌.. సాహో అనే త్రిభాషా చిత్రాన్ని చేస్తున్నారు.