25 ఏళ్ల 'ముఠామేస్త్రి'

  • IndiaGlitz, [Wednesday,January 17 2018]

మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్ర‌స్‌. ఆయ‌న న‌టించిన ప‌లు చిత్రాలు మాస్ ఆడియ‌న్స్‌ని టార్గెట్ చేసుకుని రూపొందాయి. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించాయి. అలాంటి సినిమాల‌లో 'ముఠామేస్త్రి' ఒక‌టి. లోక‌ల్ మార్కెట్‌లో ఓ ముఠాకి మేస్త్రిగా ఉండే బోస్ అనే యువ‌కుడు.. అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వెళ్ళాక ఎలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే క‌థాంశంతో తెర‌కెక్కిన చిత్ర‌మిది.

చిరుతో అధిక చిత్రాలు చేసిన ద‌ర్శ‌కుల‌లో ఒక‌రైన ఎ.కోదండ‌రామిరెడ్డి.. మెగాస్టార్ కాంబినేష‌న్‌లో చేసిన చివ‌రి చిత్ర‌మిది. మీనా, రోజా తొలిసారిగా చిరుతో రొమాన్స్ చేసిన ఈ చిత్రానికి రాజ్ కోటి అందించిన సంగీతం ఎస్సెట్‌గా నిలిచింది. ముఖ్యంగా టైటిల్ ట్రాక్ ఓ ప్ర‌భంజ‌నం సృష్టించింది. అలాగే అంజ‌నీ పుత్రుడా, ఎంత ఘాటు ప్రేమ‌యో పాట‌లు కూడా బాగా పాపుల‌ర్ అయ్యాయి.

ఈ సినిమా కోసం నాలుగోసారి ఉత్త‌మ‌నటుడిగా ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాన్ని అందుకున్నారు చిరు. జ‌న‌వ‌రి 17, 1993న విడుద‌లైన ముఠామేస్త్రి.. నేటితో 25 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

More News

క‌ల్యాణ్ పై ఐటీ దాడి...

'జైసింహా' నిర్మాత సి.క‌ల్యాణ్ ఇళ్లు, ఆఫీసుల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన త‌ర్వాత ఈ దాడులు జ‌ర‌గ‌డ‌గం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

'నా పేరు సూర్య‌..' శాటిలైట్ రైట్స్ సంచ‌ల‌నం

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఊరు ఇండియా'. అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టుడు అర్జున్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు.

బికినీకి సై అంటున్న నిఖిల్ హీరోయిన్‌...

తొలి చిత్రం 'సూర్య వర్సెస్ సూర్య' తో అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని ఆశ‌గా ఎదురుచూసిన హీరోయిన్ త్రిదా చౌద‌రికి నిరాశే మిగిలింది. ఈ అమ్మ‌డు దాదాపు నాలుగేళ్ల‌ తర్వాత త్రిదా చౌదరి తెలుగులో నటిస్తున్న చిత్రం 'మనసుకు నచ్చింది'. ఈ సినిమాలో గ్లామర్ పాత్రలో మెప్పించడానికి త్రిదా సిద్ధమైంది.

నాని 'కృష్ణార్జున యుద్దం' సాంగ్, లుక్స్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

వ‌రుస విజ‌యాల హీరో నేచ‌ర‌ల్ స్టార్ నాని... ఇప్ప‌టికే ఎనిమిది వ‌రుస విజ‌యాలు అందుకుని..  ట్రిపుల్ హ్యాట్రిక్ హిట్ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నాని న‌టిస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం' ఈ ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది.  వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్న్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్న

'తొలి ప్రేమ' ఆడియో రిలీజ్ డేట్‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతున్న చిత్రం 'తొలిప్రేమ‌'. రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. యువ ద‌ర్శకుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేస్తున్నారు.