నాగ్ ఊపిరి శ్రియ‌

  • IndiaGlitz, [Wednesday,January 20 2016]

ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మై...సంతోషం సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న క‌థానాయిక శ్రియ‌. ఆత‌ర్వాత అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించిన శ్రియ అవ‌కాశాలు త‌గ్గ‌డంతో ఇటీవ‌ల కాస్త తెర‌మ‌రుగ‌య్యింద‌నే చెప్పాలి. స‌రిగ్గా అటువంటి స‌మ‌యంలోనే నాగ్ శ్రియ‌కి మ‌నం సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో శ్రియ మ‌ళ్లీ తెలుగులో న‌టించ‌డం ప్రారంభించింది. మ‌నం త‌ర్వాత గోపాల గోపాల సినిమాలో వెంకీ స‌ర‌స‌న న‌టించింది.

తాజాగా నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందుతున్న ఊపిరి సినిమాలో ఓ ముఖ్య‌పాత్రలో శ్రియ క‌నిపిస్తుంద‌ట‌. ఇటీవ‌ల నాగార్జున - శ్రియ ల‌పై కొన్ని సీన్స్ షూట్ చేసార‌ట‌. తెలుగు, త‌మిళ్ రూపొందుతున్న ఊపిరి చిత్రాన్ని పివిపి సంస్థ నిర్మిస్తుంది. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ఊపిరి చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. నాగ్ - శ్రియ క‌ల‌సి న‌టించిన సంతోషం, నేనున్నాను, మ‌నం చిత్రాలు ఘ‌న విజ‌యాలు సాధించాయి. సో...సెంటిమెంట్ ప్రకారం ఊపిరి కూడా ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయం.

More News

వెంకీ న్యూమూవీ డీటైల్స్..

విక్ట‌రీ వెంక‌టేష్..ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో బాబు..బంగారం సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

చ‌ర‌ణ్ సినిమా లో మరో తమిళ సంగీత ద‌ర్శ‌కుడు...

రాంచ‌ర‌ణ్ హీరోగా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ‘తనీఒరువ‌న్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు.

చ‌ర‌ణ్‌ను కామెంట్ చేసిన యండ‌మూరి...

స్టార్ ర‌చ‌యిత‌గా పేరున్న యండ‌మూరి వీరేంద్ర‌నాథ్‌కు చిరంజీవితో మంచి రిలేష‌న్స్ ఉండేవి.

'సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు' సెన్సార్ పూర్తి...

ఉయ్యాల జంపాలా,సినిమా చూపిస్త మామ,‘కుమారి 21ఎఫ్’చిత్రాల సక్సెస్ తో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ చిత్రంతో హ్యాట్రిక్ ను సాధించి క్రేజీస్టార్ గా మారాడు.