చైతు, నాని బాక్సాఫీస్ పోటీ...

  • IndiaGlitz, [Tuesday,February 12 2019]

అక్కినేని నాగ‌చైత‌న్య‌, నాని పోటీ ప‌డ‌నున్నారు. ఎందులో.. ఎక్క‌డో అనుకుంటున్నారు. బాక్సాఫీస్ వ‌ద్దేనండీ!. వివ‌రాల్లోకెళ్తే.. 'నిన్ను కోరి' ఫేమ్ శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత న‌టిస్తోన్న చిత్రం 'మ‌జిలీ'. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌నున్నామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఇప్పుడు అదే తేదికి నాని జెర్సీ కూడా విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటున్నాయి సినీ వ‌ర్గాలు.

నాని, శ్రద్ధా శ్రీనాథ్ జోడిగా 'మ‌ళ్ళీరావా' ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'జెర్సీ'. ఇందులో నాని క్రికెట‌ర్ కావాల‌నుకునే మ‌ధ్య వ‌య‌స్కుడిగా క‌న‌ప‌డ‌తారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 19న విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ.. ఇప్పుడు రెండు వారాల ముందుగా అంటే ఏప్రిల్ 5న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ‌లు ఏమంటాయో చూద్దాం..

More News

ప్రముఖ దర్శక, నిర్మాత బాపినీడు ఇకలేరు

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు అలియాస్ గుట్టా బాపినీడు చౌదరి తుదిశ్వాస విడిచారు.

మోది భార్యగా..

మ‌న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోది బ‌యోపిక్ `పిఎం న‌రేంద్ర మోది` రూపొందుతోన్న సంగ‌తి విదిత‌మే. ప్ర‌ముఖ న‌టుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్ర‌లోన‌టిస్తున్నారు.

'డిస్కోరాజా' షూటింగ్ ఎప్పుడంటే..

`డిస్కోరాజా` అంటూ మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానులు ముందుకి రాబోతున్నారు.

పూర్తి స్థాయి కామెడీ పాత్ర‌లో సునీల్‌

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

వెబ్ సిరీస్‌లో నిత్యామీన‌న్‌

విల‌క్ష‌ణ న‌టిగా పేరు తెచ్చుకున్న నిత్యామీన‌న్ ఇప్పుడు డిజిట‌ల్ మీడియాలో భాగమైన వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు.