నాని డైరెక్ట‌ర్ తో నాగ చైత‌న్య..!

  • IndiaGlitz, [Saturday,September 03 2016]

యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య న‌టించిన ప్రేమ‌మ్, సాహ‌సం శ్వాస‌గా సాగిపో...ఈ రెండు చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ప్రేమ‌మ్ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇక సాహ‌సం శ్వాస‌గా సాగిపో న‌వంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే...సొగ్గాడే చిన్ని నాయ‌నా ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య ఓ సినిమా చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున నిర్మించే ఈ చిత్రం త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రంతో పాటు చైత‌న్య జెంటిల్ మెన్ ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించ‌నున్నార‌ని తెలిసింది. విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించే ఇంద్ర‌గంటితో చైత‌న్య సినిమా చేస్తే ఖ‌చ్చితంగా ఓ డిఫ‌రెంట్ మూవీ అవ్వ‌డం ఖాయం..!

More News

సెప్టెంబర్ 3న రామ్ ' హైపర్ ' టీజర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్,టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట,

త్రయం హిందీ రైట్స్

రోజు రోజుకు చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతుంది .

ఎన్టీఆర్ అప్పుడు వస్తే...ప్రాబ్లమ్ ఏమిటి అంటున్న కొరటాల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన జనతా గ్యారేజ్ పై బిగినింగ్ నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే...

మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ని తెలుగులో అనువ‌దిస్తున్న బిచ్చ‌గాడు నిర్మాత‌లు..!

ప్ర‌చారంలో కొత్త ఒర‌వ‌డి, అసాధార‌ణ‌మైన కంటెంట్ ఉంటే ఆ సినిమా హిట్టే. ఇటీవ‌లి కాలంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన అనువాద చిత్రం బిచ్చ‌గాడు నేర్పిన పాఠ‌మిది.

ట్విట్టర్ లో ఎంటరైన చిరు డాటర్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150.డైనమిక్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో