close
Choose your channels

ఎన్టీఆర్ అప్పుడు వస్తే...ప్రాబ్లమ్ ఏమిటి అంటున్న కొరటాల

Friday, September 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన జ‌న‌తా గ్యారేజ్ పై బిగినింగ్ నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే...టాక్ ఎలా ఉన్నా...ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి కలెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం విశేషం. అయితే...జ‌న‌తా గ్యారేజ్ గురించి రివ్యూ రాసే జ‌ర్న‌లిస్ట్ ల‌కే కాకుండా స‌గ‌టు ప్రేక్ష‌కుడుకి మ‌దిలో కొన్ని ప్ర‌శ్న‌లు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. జ‌న‌త గ్యారేజ్ సినిమాకి వెళ్లే ప్రేక్ష‌కుడు...సినిమా ప్రారంభం అయ్యింది అంటే...ఎన్టీఆర్ తెర పై ఎప్పుడు క‌నిపిస్తాడా..? అని ఎదురు చూస్తుంటారు. అయితే జ‌న‌తా గ్యారేజ్ సినిమా ప్రారంభం అయిన దాదాపు 20 నిమిషాలు వ‌ర‌కు ఎన్టీఆర్ ఎంట్రీ ఉండ‌దు. ఇది ఎన్టీఆర్ అభిమానుల‌కే కాదు స‌గ‌టు ప్రేక్ష‌కుడికి కాస్త ఇబ్బందే. ఇదే విష‌యాన్ని డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌ని అడిగితే...ఎన్టీఆర్ సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల త‌ర్వాత వ‌స్తే...ఏమిటి ప్రాబ్లమ్..? ఎవ‌రికి ప్లాబ్ల‌మ్..? అంటూ ప్ర‌శ్న‌కు ప్ర‌శ్నే స‌మాధానంగా ఇచ్చారు.
మ‌రో ప్ర‌శ్న ఏమిటంటే...మోహ‌న్ లాల్, ఎన్టీఆర్ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏమిటి అనేది సినిమా ప్రారంభంలోనే చెప్పేసారు బాగానే ఉంది. మోహ‌న్ లాల్ హైద‌రాబాద్ లో ఉంటే...ఎన్టీఆర్ ముంబాయిలో ఉంటారు. అనుకోకుండా ఎన్టీఆర్ హైద‌రాబాద్ రావ‌డం త‌ర్వాత మోహ‌న్ లాల్ ఇంట్లోనే ఉండ‌డం జ‌రుగుతుంది. కానీ...మోహ‌న్ లాల్ కి త‌న త‌మ్ముడు కొడుకే ఎన్టీఆర్ అన్న విష‌యం తెలియ‌దు. సొంత కొడుకుకి త‌న ఆలోచ‌నా విధానం రాదు..త‌న త‌మ్ముడు కొడుకు (ఎన్టీఆర్ )కి వ‌స్తుంది. అలాంటప్పుడు మోహ‌న్ లాల్ కి ఎన్టీఆర్ త‌న త‌మ్ముడు కొడుకు అని తెలిసిన‌ప్పుడు ఎలా ఫీల‌వ్వాలి. త‌న ఆలోచ‌నా విధానం కొడుకే రాలేదు...అలాంటిది నాలా ఆలోచిస్తూ...ఇన్నాళ్లు నా ఇంట్లో ఉన్న ఆనంద్ నా త‌మ్ముడు కొడుకా...? అని ఎంత ఎమోష‌న్ అవ్వాలి. ఈ విష‌యం తెలిసే సీన్ లో ఎన్టీఆర్ కాస్త ఇది నా ఫ్యామిలీయేనా..అని రియాక్ష‌న్ ఇస్తాడు. కానీ....మోహ‌న్ లాల్ ముఖంలో అస‌లు రియాక్ష‌నే ఉండ‌దు. ఇదే విష‌యాన్ని కొర‌టాల‌ను అడిగితే... ఈ ఎమోష‌న్ కంటే వేరే ఎమోష‌న్ డామినేట్ చేసింది అన్నారు..!
అస‌లు...సినిమా ప్రారంభం నుండి ప్రేక్ష‌కులు ఎన్టీఆర్ - మోహ‌న్ లాల్ ఇద్ద‌రూ ఎప్పుడు క‌లుస్తారా అని ఆస‌క్తితో ఎదురు చూస్తుంటారు. తీరా క‌లిసిన త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ వాళ్ళ‌కి ఎప్పుడు తెలుస్తుందా అని ఆస‌క్తితో ఎదురు చూస్తుంటారు. ఆ స‌న్నివేశాన్ని ఎంతో అద్భుతంగా ఊహించుకుంటాడు ప్రేక్ష‌కుడు. అయితే...ద‌ర్శ‌కుడు కూడా ఓ ప్రేక్ష‌కుడే...మ‌రి ఆయ‌న ఎందుకు ఊహించుకోలేదో..? ఈ అద్భుత స‌న్నివేశాన్ని ఏమాత్రం ప్రాధాన్య‌త లేని స‌న్నివేశంగా చిత్రీక‌రించారు..అంటున్నారు కొంత మంది.
ఈరోజు సోష‌ల్ మీడియా బాగా పెరిగిపోవ‌డంతో....రివ్యూ రాసే జ‌ర్న‌లిస్ట్ క‌న్నా...ఎక్కువుగా ప్రేక్ష‌కులు ఆలోచిస్తున్నారు. ప్ర‌తి స‌న్నివేశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. ట్విట్ట‌ర్ లో, ఫేస్ బుక్ లో సామాన్య ప్రేక్ష‌కుడు సైతం రివ్యూ రాసేస్తున్నాడు. ఇలాంటి ప‌రిస్ధితుల్లో ద‌ర్శ‌కుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప్ర‌తి స‌న్నివేశాన్ని ఒక‌టికి రెండు సార్లు అవ‌స‌ర‌మైతే అంత‌కు మించే ఆలోచించాల్సిన ప‌రిస్థితి.
ఇదంతా...కొర‌టాలకి తెలియ‌ద‌ని చెప్ప‌డం లేదు ఆయ‌న‌ పై కోపంతో చెప్ప‌డం లేదు. త‌న ప్ర‌తి సినిమాతో స‌మాజానికి ఏదో చెప్పాల‌ని త‌పిస్తూ...క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త అర్ధాన్ని ఇస్తూ...త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న కొర‌టాల లాంటి ద‌ర్శ‌కులు ఇండ‌స్ట్రీకి అవ‌స‌రం. అలాగే ఒక ర‌చ‌యితే ద‌ర్శ‌కుడు అయితే ఎలాంటి అద్భుత చిత్రాలు వ‌స్తాయో మిర్చి, శ్రీమంతుడు సినిమాలు తీసి నిరూపించారు. అందుచేత‌ ఇలాంటి మంచి ద‌ర్శ‌కుడు నుంచి సినిమా వ‌స్తుంది అంటే...అంచ‌నాలు ఎక్కువుగా ఉంటాయి. అందుక‌నే త‌దుప‌రి చిత్రాల్లో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ఉండాల‌నే ఉద్దేశ్యంతోనే చెబుతున్నాం. కోపంతో కాదు ప్రేమ‌తో..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.