‘మై ఛానల్’లో తెలుగు ఛానెల్స్‌ను ఏకిపారేసిన నాగబాబు!

  • IndiaGlitz, [Monday,March 18 2019]

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అటు ‘తమ్ముడు’ అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తుంటే.. ఇటు ‘అన్నయ్య’ నాగబాబు ‘మై ఛానల్ నా ఇష్టం’ అంటూ యూ ట్యూబ్ చానెల్‌లో జోరు పెంచారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలతో కొన్ని మీడియా సంస్థలపై సైతం స్కిట్స్ చేసిన ఆయన తాజాగా.. మరో అదిరిపోయే స్కిట్ చేసి జనసేన అభిమానులు, మెగాభిమానులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు కొమ్ముకాస్తున్న మీడియాను టార్గెట్ చేస్తూ ఘాటైన పదాలతో డైరెక్ట్ ఎటాక్ చేశారు నాగబాబు.

కాగా.. 11:30 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో నాగబాబు స్వామిజీ అవతారం ఎత్తారు. ఇక అవినీతి మీడియా, నీతి మీడియా అంటూ రెండు పాత్రల ద్వారా మీడియా అధిపతులు, జర్నలిస్ట్‌లపై పాట రూపంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వీడియోలో ఏముంది..!?

గన్నయ్య, కన్నయ్య పాత్రల ద్వారా.. ఫ్యాన్, సైకిల్ అంటూ అధికార పార్టీలను ఇన్ డైరెక్ట్‌గా విమర్శించిన ఆయన.. ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలపై దుమ్మెత్తిపోశారు. ఇక ఏబీఎన్ రాధాక్రిష్ణ, రవిప్రకాష్, రజినీకాంత్, సాంబశివరావు ఇలా అందర్నీ.. ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అంటూ కూస్తూ విలువలు పాటించకుండా సత్యాన్ని పాతేసి నిత్యమూ వ్యక్తిత్వ హత్యలే చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గడ్డితిని గుడ్డెద్దులా అడ్డగోలుగ కూస్తే.. నడ్డి విరుగుద్ది అంటూ జబర్దస్త్ టీంతో కలసి నాగబాబు చేసిన ఈ స్కిట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More News

లెఫ్ట్ పార్టీలకు 14 అసెంబ్లీ, 4 లోక్‌స‌భ సీట్లిచ్చిన జనసేన

వామ‌ప‌క్ష పార్టీల‌కు 14 అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్ స‌భ స్థానాల‌ను కేటాయించిన‌ట్లు జ‌న‌సేన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు. సీట్ల సర్దుబాట్లపై పలు చర్చల అనంత‌రం సీపీఎం పార్టీకి 7 శాస‌న‌స‌భ‌

పారికర్ మరణం బాధాకరం: జనసేనాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణం బాధాకరమని.. తన తరఫున.. జనసైనికుల తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

చంద్రబాబుకు భయం.. పరువు తీస్తున్న మోదీ, రాహుల్!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతానని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందని గులాబీబాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

బీఎస్పీకి 3పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలిచ్చిన జనసేన

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన-బీఎస్పీ-లెఫ్ట్ పార్టీలు కలిసి ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పొత్తుల్లో భాగంగా బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీకి మూడు లోక్‌స‌భ‌

మనోహర్ పారికర్ కన్నుమూత.. విషాదంలో కమలదళం

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తుదిశ్వాస విడిచారు. 63 ఏళ్ల పారికర్ కొంతకాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన తన నివాసంలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు.