నాగబాబు సొంత ప్రోగ్రామ్!!

మెగా బ్రదర్ నాగబాబుకు మంచి క్రేజ్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ జబర్‌దస్త్. ఈ కామెడీషో నుండి నాగబాబు కొన్ని కారణాలతో పక్కకు తప్పుకున్నారు. మరో టీవీలో అదిరింది అనే ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు తనే సొంతంగా ఓ కామెడీ షోను ప్లాన్ చేశాడట నాగబాబు. అయితే ఈ షోను నాగబాబు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి ఉపయోగించబోతున్నారట. అలాగే ఈ షో ఇతర టీవీ ఛానెల్స్‌లో ప్రసారం కాదట. ‘మన ఛానెల్ మన ఇష్టం’అనే యూ ట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం అవుతుందట. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది. జబర్‌దస్త్, అదిరింది షోల తరహాలో నాగబాబు చేయబోయే సొంత షోల్లోనూ టీమ్ లీడర్స్ ఉంటారట. అనుభవం ఉన్న టీమ్ లీడర్స్‌తో పాటు, కొత్తవాళ్లు కూడా జాయిన్ అవుతారట. ఈ షో ఏ మేరకు సక్సెస్ అవుతుందో కాదో తెలియదు కానీ.. అదిరింది షోలో మరి నాగబాబు పాల్గొంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రోగ్రామ్ ద్వారా యంగ్ టాలెంట్‌కు అవకాశాలు దక్కి, ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అయితే.. ఇతర ఛానెల్స్‌లో ప్రోగ్రామ్‌ టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది.

తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరిన నాగబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై, సామాజిక పరిస్థితులపై నాగబాబు తనదైన శైలిలో ట్వీట్స్ పెడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వచ్చారు. మరో వైపు ఎలాగూ నాగబాబు సినిమాల్లో తనకు సరిపోయే క్యారెక్టర్స్ చేస్తూ మెప్పిస్తూ వస్తున్నారు.

More News

బాలీవుడ్ రీమేక్ అవుతున్న ‘మత్తు వదలరా’

ప్రస్తుతం తెలుగు నుండి పలు చిత్రాలు బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతున్నాయి. ఆ కోవలో ఇప్పుడు మరో చిత్రం చేరింది.

రాజధాని భూ కుంభకోణం వ్యవహారంలో కీలక వ్యక్తుల అరెస్ట్

అమరావతి రాజధాని భూ కుంభకోణం విషయంలో ఇద్దరు కీలకు వ్యక్తులను బుధవారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

గాంధీ ఆస్పత్రి సిబ్బందితో ప్రభుత్వ చర్చలు సఫలం

గాంధీ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, నర్సులతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి.

ఏపీలో షాకింగ్: హడలెత్తించిన కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..

ఏపీలో షాకింగ్ స్థాయిలో నేడు కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలకు సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

ఏపీలో వీడిన సస్పెన్స్.. కరోనాను కంట్రోల్ చేసిన డాక్టర్‌కు మంత్రి పదవి!

ఏపీలో సస్పెన్స్ వీడింది. ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారి ప్లేస్‌ను ఏపీ సీఎం జగన్ ఎవరితో భర్తీ చేస్తారా?