close
Choose your channels

బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు

Thursday, May 28, 2020 • తెలుగు Comments

బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగబాబు

టాలీవుడ్ సినిమా షూటింగులు పున: ప్రారంభించడంపై నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో కొత్త వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్‌, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో సినీ పెద్దలు జరిపిన విషయం తనకు అస్సలు తెలియదని బాలయ్య చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్‌లో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన పలువురు బాలయ్య వ్యాఖ్యలపై స్పందించి క్లారిటీ ఇవ్వగా.. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన యూ ట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిలవలేదని చెప్పడంలో తప్పులేదు కానీ..

ఇవాళ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని.. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని వీడియో ముఖంగా డిమాండ్ చేశారు. మీరు చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీనే కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని సైతం కించపరిచేలా ఉన్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ‘ ఈ వీడియో నా సొంత బాధ్యతతో చేస్తున్నాను. లాక్ డౌన్ కారణంగా ఇండస్ట్రీలోని వేల మంది కార్మికులు ఇబ్బందులు పడుతుంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకూ అంతా కలిసి తలోచేయి వేసి ఆదుకున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలు భేటీ అయ్యారు. షూటింగ్ లను ఎలా ప్రారంభించాలనే దానిపై మాత్రమే చర్చించా. అయితే చిరంజీవి ఇంట్లో కలుద్దామని మంత్రి చెప్పారా? లేదా? అనే విషయం నాకు తెలియదు. మీటింగ్‌కు మిమ్మల్ని పిలవలేదని చెప్పడంలో తప్పులేదు కానీ.. భూములు పంచుకుంటున్నారని ఆరోపించడం దారుణం. ఈ మాటతో పాటు ఏదో బూతు మాట్లాడినట్లున్నారు.. దాన్ని మీడియా వాళ్లు బీప్ చేశారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల బాలయ్యను మీటింగ్‌కు పిలిచి ఉండకపోవచ్చు. కొంచెం నోరు కంట్రోల్‌లో పెట్టుకోండి బాలకృష్ణ గారు. భూములు పంచుకోవడానికి ఎవరూ వెళ్లలేదు. మమ్మల్ని ఎవరూ పిలవలేదు. ఇదేనా మీకు ఇండస్ట్రీపై ఉన్న గౌరవం’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.

మీరేం కింగ్ కాదు..

భూములను పంచుకున్నారంటూ మీరు చేసిన వ్యాఖ్యలు నిజంగా నన్ను చాలా బాధించాయి. ఒక నిర్మాతగా, నటుడిగా నన్ను ఎంతో బాధించాయి.. ఆవేదనగా ఉంది. నోటికి వచ్చినంత మాట్లాడటం సరికాదు. ఈ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇలాగే మాట్లాడతానంటే మాత్రం అంతకు పది రెట్లు మాట్లాడేవారు ఇక్కడ ఉన్నారు. ఇండస్ట్రీ బాగు కోసమే వెళ్లారు కానీ.. భూములు పంచుకోవడానికి కాదు బాలకృష్ణగారూ. ఇండస్ట్రీకి మీరేం కింగ్ కాదు.. మీరు కూడా ఒక హీరో మాత్రమే. బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలి. బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి. టాలీవుడ్‌కు తెలంగాణ ప్రభుత్వానికి బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దు. ఇక్కడ ఎవడూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలేదు.. అది ఎవరు చేశారో.. ఆంధ్రప్రదేశ్‌కి వెళ్తే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని నమ్మి ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయో మీరు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల అన్నది తెలుస్తోంది. మీరు ఏం మాట్లాడినా.. నోరు మూసుకుని కూర్చోడానికి ఎవరూ లేరు. మాటలు కంట్రోల్‌లో ఉండాలి బాలకృష్ణ గారు’ అంటూ బాలయ్యకు నాగబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాగా.. బాలయ్యకు నాగబాబు కౌంటరివ్వడం ఇదేం కొత్తకాదు.. గతంలో ఈ ఇద్దరి మధ్య పలుమార్లు మాటల యుద్ధం జరిగింది. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం.

Get Breaking News Alerts From IndiaGlitz