‘మన్ముథుడు-2’ పై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో..: నాగ్

  • IndiaGlitz, [Wednesday,August 07 2019]

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. ఈ సినిమాలో నాగార్జున వయసు మళ్లినా పెళ్లి కాని బ్రహ్మచారి పాత్రలో కనిపించనున్నాడు. ఆగస్ట్-09న మన్మథుడు అభిమానుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, ట్రైలర్స్ మంచి టాక్ తెచ్చుకోగా.. సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా కథ.. రాహుల్ డైరెక్షన్, రకుల్ నటనతో పాటు తదుపరి ప్రాజెక్ట్స్‌ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సినిమా గురించి..!

నేను చాలా సినిమాలు చేసినప్పటికీ, కొత్త కథలపై, మనసుకు దగ్గరైన కథలపై కాస్త ఎక్కువ ఇంట్రస్ట్ ఉంటుంది. అలాంటి కథే ‘మ‌న్మథుడు 2’. సినిమాలో ఎమోషన్ గుడ్ ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా ఉంటుంది. అయితే, స్క్రిప్ట్‌ చాల బాగున్నా సినిమా పై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని నేనూ ఆసక్తిగా ఉన్నాను. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సినిమా తీసిన విధానం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. పైగా రాహుల్ కూడా నన్ను కొత్తగా చూపించాలని అనుకున్నాడు. ఖచ్చితంగా తను తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాలో రకుల్ పాత్ర చాలా బాగుంటుంది. అవంతిక పాత్రలో చాల బాగా నటించింది అని అక్కినేని చెప్పుకొచ్చారు.

More News

సుష్మాకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలు పూర్తి

కేంద్ర మాజీ మంత్రి, సాయం అడిగితే కాదనకుండా చేసే సుష్మాస్వరాజ్‌ అలియాస్ చిన్నమ్మ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి.

సాహో లో స్టైలిష్ యాక్షన్ క్యారెక్టర్ చేసిన చుంకి పాండే... పోస్టర్

సాహో విడుదలకు రెడీ అయ్యేందుకు సిద్ధమౌతోన్న సందర్భంలో.... సినిమాలో నటించిన ఒక్కో పాత్ర ను పరిచయం చేస్తున్నారు.

‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..!

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కిన చిత్రం ‘సాహో’.

'రణరంగం' సెన్సార్ పూర్తి , ఆగస్టు 15 న విడుదల

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో

ముందుగానే `రూలర్` వచ్చేస్తున్నాడా?

బాల‌య్య రౌడీయా?  పోలీసా?  రౌడీగా రూల్ చేస్తారా?  పోలీస్‌గా రూల్ చేస్తారా?  ఏదైతేనేమి... మొత్తానికి రౌడీపోలీస్‌గా రూల‌ర్ అనిపించుకుంటాడా? అని అభిమానుల్లో కుతూహ‌లంగా ఉంది.