close
Choose your channels

ముందుగానే `రూలర్` వచ్చేస్తున్నాడా?

Wednesday, August 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ముందుగానే `రూలర్` వచ్చేస్తున్నాడా?

బాల‌య్య రౌడీయా? పోలీసా? రౌడీగా రూల్ చేస్తారా? పోలీస్‌గా రూల్ చేస్తారా? ఏదైతేనేమి... మొత్తానికి రౌడీపోలీస్‌గా రూల‌ర్ అనిపించుకుంటాడా? అని అభిమానుల్లో కుతూహ‌లంగా ఉంది. రౌడీ, పోలీస్ అనేవి రెండు గెట‌ప్పులా? రెండు పాత్ర‌లా? అనే విష‌యం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రానికి మాత్రం `రూలర్ `అనే టైటిల్‌ను దాదాపుగా ఖ‌రారు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్టు వినికిడి.

ఈ సినిమా బ్యాంకాక్‌లో పాటల చిత్రీకరణతో షూటింగ్ మొదలు పెట్టనుంది. బాలకృష్ణ సరసన వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే అదే సంక్రాంతికి రజనీకాంత్ `దర్బార్`, మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సినిమాను ఇదే ఏడాది క్రిస్‌మస్‌కు విడుదల చేయాలనుకుంటున్నారట. అందుకోసమని ఎక్కువ బ్రేక్స్ లేకుండా సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేస్తారని వార్తలు వినపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.