‘మన్ముథుడు-2’ స్టోరీ రివీల్ చేసిన నాగ్!

  • IndiaGlitz, [Wednesday,August 07 2019]

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. ఈ సినిమాలో నాగార్జున వయసు మళ్లినా పెళ్లి కాని బ్రహ్మచారి పాత్రలో కనిపించనున్నాడు. ఆగస్ట్-09న మన్మథుడు అభిమానుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా కథతో పాటు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నవ్వులే నవ్వులు!

‘మన్మథుడు-2’లో బ్రహ్మానందం అలాగే త్రివిక్రమ్ రైటింగ్‌తో ఫుల్ కామెడీని పండించారు.. నవ్వులే నవ్వులంతే.. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా వెన్నెల కిషోర్.. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ కూడా జనాలను ఫుల్‌గా నవ్విస్తాయి. కామెడీ బాగా వర్కౌట్ అవుతుందనుకుంటున్నా. ఈ సినిమాలో రొమాన్స్ కంటే కూడా.. హాస్యభరితమైన ఫ్యామిలీ డ్రామా ఉంటుంది.

సినిమా స్టోరీ ఇదీ..

సినిమాలో నేను మధ్య వయస్కుడైన ఓ సరదా ప్రేమ బ్రహ్మచారి పాత్ర. సినిమాలో నాకు ముగ్గురు సోదరీమణులు అలాగే తల్లి ఉంటారు. అయితే నా ఇష్టానికి వ్యతిరేకంగా నేను వివాహం చేసుకోవాలని వాళ్లు నన్ను బలవంతం చేస్తారు. వారిని సంతృప్తి పరచడానికి సినిమాలో నేను ఏమి చేస్తాను అనేది మిగతా కథ. నాకు ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేసే ఆలోచన అయితే లేదు. నా దృష్టి అంతా టాలీవుడ్ పైనే అని నాగ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ నెల-09న వస్తున్న ‘మన్మథుడు’ ఏ మాత్రం సక్సెస్ అవుతాడో వేచి చూడాల్సిందే మరి.

More News

‘మన్ముథుడు-2’ పై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో..: నాగ్

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’.

సుష్మాకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలు పూర్తి

కేంద్ర మాజీ మంత్రి, సాయం అడిగితే కాదనకుండా చేసే సుష్మాస్వరాజ్‌ అలియాస్ చిన్నమ్మ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి.

సాహో లో స్టైలిష్ యాక్షన్ క్యారెక్టర్ చేసిన చుంకి పాండే... పోస్టర్

సాహో విడుదలకు రెడీ అయ్యేందుకు సిద్ధమౌతోన్న సందర్భంలో.... సినిమాలో నటించిన ఒక్కో పాత్ర ను పరిచయం చేస్తున్నారు.

‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..!

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కిన చిత్రం ‘సాహో’.

'రణరంగం' సెన్సార్ పూర్తి , ఆగస్టు 15 న విడుదల

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో