సుమంత్ అశ్విన్, నందిత శ్వేత ల‌ 'ప్రేమ కథా చిత్రం 2' మెద‌టి లుక్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Thursday,October 18 2018]

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాదించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2. ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిధ్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు.

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ 'ప్రేమ కథా చిత్రం 2' సినిమా మెద‌టిలుక్ ని విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల చేశాము.

'బ్యాక్ టూ ఫియర్ అనే క్యాప్షన్ తో ఇప్ప‌టికే 90% షూటింగ్ పూర్తిచేసుకుని మ‌రో రెండు పాట‌లు, క్లైమాక్స్ మిన‌హ షూటింగ్ పార్ట్ ని పూర్తిచేసుకంది. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి న‌వంబ‌ర్ చివ‌రి వారంలో విడుద‌ల‌కి స‌న్నాహ‌లు చేస్తున్నారు..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్ పి ఏ క్రెయేషన్స్ బ్యానర్లో వచ్చిన ప్రేమ కథా చిత్రం, జక్కన్న సూపర్ హిట్స్ గా మా సంస్థ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేమ కథా చిత్రం హిలేరియస్ కామెడీ తో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రేమ కథా చిత్రం 2 ప్రారంభించాం. సుమంత్ ఆశ్విన్ , సిధ్ధి ఇద్నాని లు జంట‌గా నటిస్తున్నారు. ఎక్క‌డికి పొతావు చిన్న‌వాడా చిత్రంతో క్రేజి హీరోయిన్ గా మారిన నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది.

హ‌రి కిషన్ ను దర్శకుడు గా పరిచయం అవుతున్నాడు. లవ్ అండ్ హ‌ర్ర‌ర్ కామెడి ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథ ఇది. మా బ్యానర్ కి మరొక సూపర్ హిట్ చిత్రం గా నిలుస్తుందని నమ్ముతున్నాం. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా మెద‌టి లుక్ ని విడుద‌ల చేసాం.. ఈ నెల 22 నుండి బ్యాల‌న్స్ రెండు సాంగ్స్‌, క్లైమాక్స్ ని షూట్ చేసి, న‌వంబ‌ర్ నెలాఖ‌రుకి విడ‌దుల స‌న్నాహ‌లు చేస్తున్నాం.

More News

ఘ‌నంగా జ‌రిగిన దేవ‌దాస్ స‌క్సెస్ మీట్..

నాగార్జున, నాని న‌టించిన దేవ‌దాస్ చిత్ర స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్ లో జ‌రిగింది. సినిమా యూనిట్ అంతా ఈ స‌క్సెస్ మీట్ లో పాల్గొన్నారు. 

సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానుల సేవా కార్యక్రమాలు

కృష్ణ జిల్లా కృష్ణ లంక నల్లగేట్ కృష్ణ టీ స్టాల్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన సీనియర్ అభిమాని లొల్ల కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు

దీపావళికి ముద్ర విడుదల

బ్లాక్ మనీ కారణంగా సమాజాభివృద్ధి కుంటుపడుతోంది. రాజకీయ నాయకులు తాము ఎన్నికల్లో నెగ్గడం కోసం బ్లాక్ మనీని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు.

స‌మంత చిత్రంలో ఆ హీరో?

ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో మెప్పించిన స‌మంత పెళ్లి త‌ర్వాత పెర్ఫామెన్స్ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంది.

రామ్ అసంతృప్తి...

ఎనర్జ‌టిక్ స్టార్ రామ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన చిత్రం 'హ‌లో గురు ప్రేమ‌కోస‌మే'. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది.