close
Choose your channels

స‌మంత చిత్రంలో ఆ హీరో?

Wednesday, October 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స‌మంత చిత్రంలో ఆ హీరో?

ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో మెప్పించిన స‌మంత పెళ్లి త‌ర్వాత పెర్ఫామెన్స్ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంది. ఇటీవ‌ల ఆమె న‌టించిన `యూ ట‌ర్న్‌`సినిమా న‌టిగా స‌మంత‌కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ప్ర‌స్తుతం `నిన్నుకోరి` ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర్త నాగ‌చైత‌న్యతో క‌లిసి ఓ సినిమా న‌టిస్తుంది. ఇది కాకుండా నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి ఇది రీమేక్ అని.. ఇందులో అతీత శ‌క్తులున్న వృద్ధురాలు త‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు అందమైన అమ్మాయిగా మారిపోతుందట‌. సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించ‌నున్నాట్ట‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభం కానున్నాయి. స‌మంతతో పాటు నాగ‌శౌర్య కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.